Begin typing your search above and press return to search.

బాబు చేసే ప్రకటన ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేస్తుందా...?

By:  Tupaki Desk   |   27 May 2023 2:10 PM GMT
బాబు చేసే ప్రకటన ఏపీ పాలిటిక్స్ ని షేక్ చేస్తుందా...?
X
మహానాడుతో ఈసారి అధికారం ఖాయంగా అందుకోవాలని తెలుగుదేశం చూస్తోంది. అందుకోసం అస్త్ర శస్త్రాలను సమకూర్చుకునే పనిలో పడింది. మహనాడు వేదికగా మొత్తం టాప్ టూ బాటమ్ పార్టీకి కొత్త జోష్ ని ఇవ్వాలని కూడా చూస్తోంది

ఇదిలా ఉండగా మహానాడు తొలి రోజున చంద్రబాబు ప్రసంగం చేశారు ఆయన మాట్లాడుతూ మొత్తం పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చే సమాచారం చెప్పారు. ఆదివారం అంటే ఎన్టీఆర్ శత జయంతి వేళ జరిగే మహానాడు ముగింపు సమావేశంలో ఏపీ పాలిటిక్స్ మొత్తం షేక్ అయ్యే కీలకమైన ప్రకటన చేస్తాను అంటూ ఊరించారు.

ఇప్పటికే రాజండ్రీలో మహానాడు తో అదిరిపోయింది. ఇపుడు తాను చేయబోయే ప్రకటనతో ఏపీ రాజకీయం మొత్తం మారిపోతాయని బాబు అంటున్నారు. మరి చంద్రబాబు చేయబోయే ప్రకటన ఏంటి అన్నదే ఇపుడు చర్చగా ఉంది మరి. నిజానికి చంద్రబాబు ఇప్పటికే జిల్లాల టూర్లు తిరిగి చాలా ప్రకటనలు చేశారు.

తాము అధికారంలోకి వస్తే తెలుగుదేశం పార్టీ ఏమి చేయబోతుంది అని కూడా ఆయన చెబుతూ వచ్చారు. ఒక విధంగా తెలుగుదేశానికి సంబంధించి చాలా వరకూ చెప్పేశారు అనే భావించాలి. అయితే చంద్రబాబు ఆదివారం ఎన్నికల ప్రణాళికను మొదటి విడతను బయట పెట్టబోతున్నారు.

అందులో సంక్షేమం మొత్తం కుమ్మరిస్తారని అంటున్నారు. ఆ విధంగా ప్రధాన వర్గాలను ఆకట్టుకునే దిశగా తెలుగుదేశం మ్యానిఫేస్టో సాగుతుంది అని అంటున్నారు. మహానాడు లో అదే హైలెట్ అని అంతా చెబుతున్నారు. అదే టైం లో ఏపీలో పొత్తుల గురించి కూడా ముగింపు స్పీచ్ లో చంద్రబాబు చెబుతరా అన్నదే చూడాలని అంటున్నారు.

ఏది ఏమైనా చంద్రబాబు ప్రకటన ఏలా ఉంటుంది. ఏమి చెప్పబోతున్నారు అన్నదే ఇపుడు ఉత్కంఠను కలిగితోంది. మహానాడు శనివారం మొదలైంది కానీ అందరి చూపూ ఆదివారం మీదనే ఉంది. బాబు ఆదివారం ఈవెనింగ్ చేయబోయే ప్రసంగం 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని కచ్చితంగా అధికారంలోకి తెచ్చేలాగానే ఉంటుదని అంటున్నారు.

దానికి తగిన సరంజామా సామగ్రి అంతా చంద్రబాబు సిద్ధం చేసుకుని మరీ మహానాడు కో లాస్ట్ పంచ్ వేయబోతున్నారు అని అంటున్నారు. అధికారంలో ఉన్న వైసీపీకి షేక్ చేసేలా బాబు మార్క్ పంచులు ఉంటాయని తెలుస్తోంది. మొత్తానికి మహానాడు లో చంద్రబాబు చాలా ఉత్సాహంగా ఉన్నారు. పార్టీ ప్రతినిధులు మొత్తం జోష్ లో ఉన్నారు.

ఎపుడు ఎన్నికలు పెట్టినా అధికారం తమదే అన్న ధీమాతో ఉన్నారు ఇలాంటి నేపధ్యంలో జరుగుతున్న మహానాడులో బాబు షాకింగ్ స్టేట్మెంట్స్ ఇస్తే కనుక అది సైకిల్ జోరుని ఎక్కడా ఆపలేదని అంటున్నారు. మరి అధికార పార్టీ వైసీపీ మహానాడుని గమనిస్తఒంది. బాబు ఊరించి సస్పెన్స్ లో పెట్టిన ఆ ప్రకటన ఏంటి అన్నది వైసీపీతో పాటు అందరిలో ఆసక్తిని పెంచుక్తోంది.