Begin typing your search above and press return to search.

నారా బ్రహ్మణి పర్సనల్ విషయాల్ని చెప్పారు

By:  Tupaki Desk   |   8 March 2016 5:48 PM GMT
నారా బ్రహ్మణి పర్సనల్ విషయాల్ని చెప్పారు
X
నారా బ్రహ్మణి.. తెలుగు ప్రజలకు ఈ పేరు ఆమె పుట్టిన నాటి నుంచి సుపరిచితం. తెలుగోడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఎన్టీవోడి ముద్దుల మనమరాలు గురించి ఏ తెలుగిల్లు మాత్రం తెలుసుకోవాలనుకోదు. కాకుంటే.. తన గురించి పెద్ద ప్రచార ఆర్భాటం లేకుండా జాగ్రత్తగా ఉండే బ్రహ్మణి.. మీడియాకు కాస్త దూరంగానే ఉంటారు. అలాంటి ఆమె.. మహిళా దినోత్సవం సందర్భంగా ఒక మీడియా సంస్థతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె తన కుటుంబ విషయాలు చెప్పుకొచ్చారు.

బ్రహ్మణి నోటి వెంట వచ్చే ప్రతి మాట..తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రముఖులకు సంబంధించిన విషయాలన్న విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాత ఎన్టీవోడు.. తండ్రి బాలకృష్ణ.. మేనమామ చంద్రబాబు నాయుడు.. భర్త లోకేశ్. మరి.. ఆమె చెప్పిన విశేషాలు చూస్తే..

= తాతతో చాలా సన్నిహితంగా ఉండేదాన్ని. ఉదయం నాలుగింటికే ఆయన లేచేవారు. తాతగారితో ఎక్కువ సమయం గడిపేవాళ్లం. తాతగారితో కలిసి చికెన్‌ ఎక్కువగా తినేదాన్ని. ఆయన చాలా సరదాగా ఉండేవారు. ఉదయం నాలుగు గంటలకే చికెన్ తినమని చెప్పేవారు.

= మామగారు.. అత్తగారు ఇద్దరితోనూ చాలా క్లోజ్‌గా ఉంటా. పేరుకు అత్తారిల్లే కానీ స్వేచ్ఛ చాలా ఎక్కువ. జస్ట్ అడ్రస్ లు మారాయే కానీ.. అమ్మవాళ్లింట్లో ఎంత హాయిగా ఉందో అత్తయ్య ఇంట్లోనూ అంతే హాయి. నాన్నది సినిమా ఫీల్డ్.. మామయ్యది పొలిటికల్ ఫీల్డ్. ఇవి కాకుండా అంటే అయితే హెరిటేజ్.. లేదంటే ఎన్టీఆర్ ట్రస్ట్. వ్యాపారం.. సామాజిక సేవ రెండూ మా ఇంట్లోనే ఉన్నాయి.

= మామగారు.. అత్తగారు ఇద్దరితోనూ చాలా క్లోజ్‌గా ఉంటాను. అత్తమ్మ ఫుల్ సపోర్ట్ చేస్తారు. సలహాలు.. సూచనలు ఇస్తుంటారు. ఆమె రోజూ ఉదయాన్నే నాలుగు గంటలకే నిద్ర లేచి.. వ్యాయామం చేసి.. ఇంట్లో అంతా సవ్యంగా ఉందో లేదో చూసుకుంటారు. దూర ప్రయాణాలూ చేస్తారు. ఒంటిచేత్తో అన్ని పనులూ చక్కబెడతారు. ఆ చాకచక్యాన్ని ఆమె నుంచి నేర్చుకున్నా.

= మా ఇంట్లో ఉదయం ఆరింటికే దినచర్య మొదలై రాత్రి 10 గంటలకు ముగుస్తుంది. ఉదయం లేచిన తర్వాత ఇంట్లో అందరూ వ్యాయామం చేస్తారు. దేవాన్ష్ తో కాసేపు గడిపి.. తనకి ఏమేం కావాలో చూసుకుని.. ఆ తర్వాత పనిలో నిమగ్నమవుతాం. నేను పనిలో ఉంటే అమ్మ తనను చూసుకుంటుంది. ఉమ్మడి కుటుంబం కారణంగానే అన్నీ పనుల్ని సక్రమంగా చేయగలుగుతున్నా.


= పలు రకాల పనుల కారణంగా దేవాన్ష్ తో చాలా తక్కువ సమయం గడుపుతున్నాననిపిస్తుంది. అమ్మతో చాలా క్లోజ్. నా చదువు విషయంలో ఆమె ప్రోత్సాహం ఎంతో ఉంది.'

= దేవాన్ష్ ను చూసుకొని నాన్న చిన్న పిల్లోడు అయిపోతారు. అందుకే ఆయన్ను ‘‘గోల తాత’’ అని పేరు పెట్టాం. నాన్నను అర్థం చేసుకునే వారికి బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటారు. అర్థం చేసుకోని వారికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది.

= ఇంట్లో అందరికంటే మామగారు చాలా సరదాగా ఉంటారు. ఓపెన్‌గా మాట్లాడతారు. డబ్బు సంపాదించడం కంటే... సమాజం గురించి ఆలోచించాలని చెబుతారు.