Begin typing your search above and press return to search.

బ్రాహ్మణి.. ద న్యూ స్పోక్స్ పర్సన్

By:  Tupaki Desk   |   18 Nov 2016 10:35 AM GMT
బ్రాహ్మణి.. ద న్యూ స్పోక్స్ పర్సన్
X
నారా బ్రాహ్మణి.. నారా - నందమూరి వంశాల్లో మోస్ట్ ఛరిష్మాటిక్ పర్సన్ అని చెప్పుకోవాలి. కట్టిపడేసే రూపం... మృదుభాషణం.. స్థిత ప్రజ్హత - మేధస్సు అన్నీ కలబోసిన వ్యక్తిత్వం ఆమెది. ఇటీవల కాలంలో ఆమె నారా వారి కుటుంబంలో కీలకంగా మారుతున్నారు. నారా కుటుంబ వ్యాపారాలకు సంబంధించిన విషయాలను ఆమే వెల్లడిస్తున్నారు. తాజాగా హెరిటేజ్ - ఫ్యూచర్ గ్రూప్ డీల్ పైనా ఆమె పూర్తి వివరాలు వెల్లడించారు.

హెరిటేజ్ ఫుడ్సుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న ఆమె తమ సంస్థ ఫ్యూచర్ గ్రూపుతో చేసుకున్న ఒప్పందాలను వివరించారు. హెరిటేజ్ సంస్థ ఒక్కరోజులో ఈ స్థాయికి ఎదగలేదని... అది ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చిన సంస్థ కూడా కాదని ఆమె తెలిపారు. పాతికేళ్ల సంస్థని చెప్పారు. అంతేకాదు... సంస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న వారి ఉద్యోగ భద్రతకు ఎలాంటి ఢోకా లేదని ఆమె భరోసా ఇచ్చారు.

కాగా చంద్రబాబు కుటుంబం స్థాపించిన హెరిటేజ్ సంస్థ వ్యవహారాలు మొదట్లో చంద్రబాబే చూసుకునేవారు. ఆయన 1992లో సీఎం అయిన తరువాత భువనేశ్వరి ఛార్జి తీసుకున్నారు. ఇప్పుడు బ్రాహ్మణి మొత్తం వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నారు. బ్రాహ్మణి శక్తిసామర్థ్యాలు తెలిసినవారు ఇకపై హెరిటేజ్ పరుగులు తీయడం ఖాయమంటున్నారు. అదే సమయంలో బ్రహ్మణి సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగానే కాకుండా రాజకీయాల్లో అడుగిడి మంచి నేతగానూ నిలుస్తారని పలువురు జోష్యం చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/