Begin typing your search above and press return to search.

భువనేశ్వరి... విమెన్ వెపన్... టీడీపీకి ప్లస్సేనా.. ?

By:  Tupaki Desk   |   21 Dec 2021 1:30 AM GMT
భువనేశ్వరి... విమెన్ వెపన్... టీడీపీకి ప్లస్సేనా.. ?
X
నారా భువనేశ్వరి. నందమూరి వారి ఆడపడుచు, తెలుగు వల్లభుడు ఎన్టీయార్ ముద్దుల తనయ. ఆమె లేటెస్ట్ గా మీడియా ముందుకు వచ్చారు. ఇక ఆమె తిరుపతి టూర్ కూడా ఆసక్తికరం. ఎన్టీయార్ పేరు మీద వరద బాధితులకు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియాతో భువనేశ్వరి మాట్లాడిన మాటలు ఎంతో పరిపక్వేతలో ఉన్నాయని అంటున్నారు.

ఆమె తన మీద వైసీపీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యల గురించి స్పందించడానికి పెద్దగా ఇష్టపడలేదు, అదే సమయంలో ఇంతకంటే ఎక్కువగా ఘోరాలు, నేరాలు బయట సమాజంలో మహిళల మీద జరుగుతున్న జరుగుతున్నాయని ఆమె అనడం విశేషం. మహిళల గురించి ఆమె చెప్పిన మాటలు కూడా ఈ సందర్భంగా ఆలోచనాపరులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

మహిళే ఈ సమాజనికి పునాది అని ఆమెను క్రియేటర్ గా కూడా అభివర్ణించారు. ఆడపిల్ల అంటే ఆటవస్తువు కాదు అంటూ భువనేశ్వరి చేసిన కామెంట్స్ నిజంగా చాలా మందికి చెంపపెట్టుగానే చూడాలి. ఇక తన మీద వైసీపీ నేతలు ఏం మాట్లాడారు అన్నది పెద్దగా ఉపయోగపడని విషయం అంటూ దాన్ని వదిలేయాలని ఆమె అనడం వివేచకను అద్దం పడుతోంది. ఒక విధంగా పరిపూర్ణమైన మహిళగా ఆమె రియాక్ట్ అయ్యారనుకోవాలి.

ఇక మహిళలకు మద్దతుగా ఆమె మాట్లాడిన మాటలు వారి పక్షాన తాను ఉన్నట్లుగా తెలియచేస్తున్నాయి. ఏపీ రాజకీయాల్లో ఒక పెద్దింటి మహిళ, అందునా రాజకీయంగా అగ్రభాగాన ఉన్న కుటుంబ సభ్యురాలు అయిన భువనేశ్వరి లాంటి వారు మహిళల రక్షణ, భద్రత గురించి మాట్లాడం అంటే విశేషంగానే చూడాలి. ఇది అబలలకు ఒక అండగానే భావించాలి.

మహిళల మీద దాడులు జరుగుతున్నాయని అందరూ ఆరోపించవచ్చు కానీ సరైన వారు, ఫోకస్ గా స్ట్రాంగ్ గా కనిపించేవారు కనుక ముందుకు వచ్చి మాట్లాడితే ఆ లెక్క వేరుగా ఉంటుంది. ఇపుడు భువనేశ్వరి మీడియాతో మాట్లాడిన మాటలు ఆమెలో లీడర్ షిప్ క్వాలిటీస్ ఏంటో చూపించాయని అంటున్నారు. పైగా మెచ్యూరిటీతో ఆమె వ్యవహరించారు అని కూడా అంటున్నారు.

మహిళల రక్షకురాలిగా ఆమె కనుక ఇదే తీరున ముందుకు వచ్చిసమాజన అరాచకాలను చీల్చిచెండాడితే అది రాజకీయంగా పెను దుమారమే రేపడం ఖాయం. అదే టైమ్ లో ఆమె రాజకీయాల గురించి తన ఆలోచనలను ఈ రోజు చెప్పకపోయినా ఆమె ఇలా బయటకు రావడమే ఒక విశేషం కాబట్టి. వచ్చే ఎన్నికల వేళ ఆమె విమెన్ పవర్ గా ఒక వెపన్ గా టీడీపీకి బాగా ఉపయోపడే అవకాశాలను అయితే ఎవరూ కొట్టిపారేయలేరు. చూడాలి మరి ఎలా జరుగుతుందో.