Begin typing your search above and press return to search.
హరీష్ రావుపై డీజీపీకి టీడీపీ ఫిర్యాదు
By: Tupaki Desk | 10 Sept 2015 6:03 PM ISTతెలంగాణ భారీ నీటిపారుదల శాఖా మంత్రి కల్వకుంట్ల హరీష్ రావు పై టీ టీడీపీ నేత ఒకరు ఏకంగా డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు. సంచలనం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నల్గొండ జిల్లాలో పవిత్రమైన యాదగిరిగుట్ట పై హరీష్ రావు తన అనుచరులతో కలిసి నిబంధనలకు విరుద్ధంగా ర్యాలీ నిర్వహించారంటూ టీ.టీడీపీ నేత నన్నూరి నర్సిరెడ్డి డీజీపీ అనురాగ్ శర్మకు ఫిర్యాదు చేశారు.
హరీష్ రావు భక్తుల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి డీజీపీ తక్షణమే హరీష్ పై చర్యలు తీసుకోవాలని నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. నన్నూరి ఇటీవల తెలంగాణలో టీడీపీ తరపున బాగానే తన గళం వినిపిస్తున్నారు. సీఎం కేసీఆర్ తో పాటు అధికార పార్టీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై గట్టిగానే ధ్వజమెత్తుతున్నారు. తాజాగా ఆయన మంత్రి హరీష్ పై చేసిన ఫిర్యాదుకు ఎలాంటి స్పందన వస్తుందో...డీజీపీ ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి.