Begin typing your search above and press return to search.

బాబు ఫ్యూచర్ పై నాని సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   19 Feb 2020 4:41 AM GMT
బాబు ఫ్యూచర్ పై నాని సంచలన వ్యాఖ్యలు
X
వైసీపీ కీలక నేత, మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని మీడియా ముందుకు వచ్చారంటే... ఏపీలో విపక్ష పార్టీ టీడీపీ, ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి నారా లోకేశ్ లపై ఎలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తారోనన్న ఆసక్తి అమాంతం పెరిగిపోవడం ఖాయమే. అలాంటిది మంత్రి హోదాలో దేశ రాజధాని ఢిల్లీలో అడుగుపెట్టిన సందర్భంగా కొడాలి నాని... చంద్రబాబుపై సంచలనాలకే సంచలనాలుగా నిలుస్తున్న వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా బాబుకు జైలు ఖాయమంటూ తనదైన శైలిలో బాబు భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వంలోని పలువురు మంత్రులను కలిసేందుకు మంగళవారం ఢిల్లీకి వెళ్లిన నాని... మీడియాతో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబును టార్గెట్ చేసుకుని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా కొడాలి నాని ఏమన్నారన్న విషయానికి వస్తే... ‘‘ మాజీ సీఎం చంద్రబాబు అక్రమ సంపాదనలో రూ.2వేల కోట్లు చాలా చిన్న అమౌంట్. వాటికి సంబంధించిన ఆస్తులు, నగదు, డాక్యుమెంట్ల వివరాలతో పాటు చంద్రబాబు చెప్పిన మేరకు ఎవరెంత డబ్బులు ఇచ్చింది మాజీ పీఎస్ శ్రీనివాస్ తన డైరీలో రాసుకున్నారు.

బాబు ఫ్యూచర్ ఖచ్చితంగా జైలే. చేసిన అక్రమాలకు ఆయన శిక్ష అనుభవించక తప్పదు. శ్రీనివాస్ ఇంట్లో రూ.2 లక్షలు దొరికితే.. దాన్ని రూ.2 వేల కోట్లుగా వైసీపీ ప్రచారం చేస్తోందని టీడీపీ నేతలు అంటున్నారు. నిజమే. బుద్ధి ఉన్న ఏ సన్నాసి కూడా ఇంట్లో రూ.2వేల కోట్లు దాచుకోడు. అలా చేయడానికి చంద్రబాబు పిచ్చోడేమీ కాదు. ప్రెస్ మీట్ లో సూట్ కేసులు చూపించి... ఇందులో అంత డబ్బు పడుతుందా? అని టీడీపీ నేేతలు అడుగుతుండటం కామెడీగా ఉంది’’ అని నాని ఓ రేంజిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.