Begin typing your search above and press return to search.

నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ తీరు ఇదే!

By:  Tupaki Desk   |   28 Aug 2017 7:12 AM GMT
నంద్యాల ఉప ఎన్నిక కౌంటింగ్ తీరు ఇదే!
X
క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు నేటి ఉద‌యం ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపులో తొలుత నంద్యాల రూర‌ల్ మండ‌లానికి సంబంధించిన ఓట్ల‌ను లెక్కిస్తున్నారు. ఈ మండలంలోని మొత్తం ఓట్ల‌ను ఆరు రౌండ్ల‌లో లెక్కించారు. ఈ మొత్తం ఆరు రౌండ్ల‌లో టీడీపీ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఆ త‌ర్వాత నంద్యాల అర్బ‌న్ మండ‌లం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా... ఏడు - ఎనిమిది - తొమ్మిది రౌండ్ల‌లోనూ టీడీపీ ఆధిక్యం సాధించింది. అయితే ఆ ఆధిక్యం వెయ్యి ఆ పై నుంచి వంద‌ల్లోకి త‌గ్గిపోయింది.

ఇక గోస్పాడు మండ‌లం ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా... తొలి రౌండ్‌ లోనే వైసీపీ ఆధిక్యం సాధించింది. అక్క‌డి తొలి రౌండ్‌ - మొత్తంగా 16వ రౌండ్ లో వైసీపీ అభ్య‌ర్థి 654 ఓట్ల ఆధిక్యాన్ని సాధించారు. అయితే ఆ వెనువెంట‌నే తిరిగి టీడీపీ మెజారిటీ పుంజుకుంది. 17వ రౌండ్‌ లో టీడీపీ అభ్య‌ర్థి 915 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. 18వ రౌండ్‌ లోనూ టీడీపీ అభ్య‌ర్థి 506 ఓట్ల మెజారిటీ సాధించారు. 19వ రౌండ్‌ లో టీడీపీ 367 ఓట్ల మెజారిటీ సాధించింది. దీంతో మొత్తంగా 19వ‌ రౌండ్ ముగిసే స‌రికి టీడీపీ అభ్య‌ర్థి భూమా బ్రహ్మానంద‌రెడ్డి 27,456 మెజారిటీ సాధించారు. అంతిమంగా భూమా బ్ర‌హ్మానంద‌రెడ్డి త‌న స‌మీప ప్ర‌త్య‌ర్థి - వైసీపీ అభ్య‌ర్థిపై 27,456 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

రౌండ్ వైసీపీ టీడీపీ మెజారిటీ
19. 654 921 367

18. 3,961 4,467 506

17. 4,248 5,163 915

16. 5,317 4,663 654

15. 4,328 5,770 1,442

14. 3,868 5,172 1,304

13. 4,230 5,690 1,460

12. 4,049 5,629 1,580

11. 3,722 4,326 604

10. 3,156 4,682 1,486

9. 3,430 4,309 879

8. 4,088 4,436 340

7. 4,312 4,859 362

6. 2,858 6,161 3,302

5. 3,463 6,955 3,492

4. 2,868 6,465 3,597

3. 3,553 6,640 3,113

2. 3,400 5,162 1,762

1 4,279 5,477 1,198