Begin typing your search above and press return to search.

తార‌క ర‌త్న ప‌ర్య‌ట‌న‌.. త‌మ్ముళ్ల రెస్పాన్స్ ఇదేనా..?

By:  Tupaki Desk   |   19 Dec 2022 10:30 AM GMT
తార‌క ర‌త్న ప‌ర్య‌ట‌న‌.. త‌మ్ముళ్ల రెస్పాన్స్ ఇదేనా..?
X
టీడీపీ అంటే మాదేన‌ని.. తాను కూడా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేస్తాన‌ని.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు నందమూరి హ‌రికృష్ణ కుమారుడు, హీరో.. తార‌క ర‌త్న‌. గుంటూరు జిల్లాలో ఆయ‌న ఆదివారం ప‌ర్య‌టించి.. ఎన్టీఆర్ విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఆయ‌న ఏమ‌న్నారు? అనేది కొంచెం సేపు ప‌క్క‌న పెడితే.. నంద‌మూరి కుటుంబం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఇటీవ‌ల కాలంలో బాల‌కృష్ణ త‌ప్ప పెద్ద‌గా ఎవ‌రూ రావ‌డం లేదు.

కొన్నాళ్ల కింద‌ట చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రిని వైసీపీ నాయ‌కులు దూషించిన నేప‌థ్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టిన నందమూరి కుటుంబం.. వైసీపీ నేత‌ల‌కు వార్నింగ్ ఇచ్చారు. అంటే.. రాజ‌కీయ వివాదాన్ని కేవలం కుటుంబ స‌మ‌స్య‌గా మారిన‌ప్పుడు మాత్ర‌మే వారు రియాక్ట్ అయ్యారు. పార్టీ కేంద్ర కార్యాల‌యంపై దాడి జ‌రిగిన‌ప్పుడు కానీ.. చంద్ర‌బాబు కాన్వాయ్‌పై రాళ్లు వేసిన‌ప్పుడు కానీ, ఎవ‌రూ స్పందించ‌లేదు.

కానీ, ఇప్పుడు హ‌ఠాత్తుగా నంద‌మూరి తార‌క‌ర‌త్న‌.. గుంటూరుకురావ‌డం.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాను పోటీ చేస్తాన‌ని చెప్ప‌డం.. సంచ‌ల‌న‌మే అనుకోవ‌చ్చు. అయితే, ఆయ‌న ఎలా రియాక్ట్ అయినా.. క్షేత్ర‌స్థాయిలో పార్టీ నేత‌లు ఎలా రియాక్ట్ అయ్యారు? అనేది ఆస‌క్తిగా మారింది. గుంటూరులో ప‌ర్య‌టించిన ఆయ‌న వెంట చెప్పుకోద‌గ్గ నాయ‌కుడు ఒక్క‌రు కూడా వెళ్ల‌లేదు. పోనీ.. నాయ‌కులకు చెప్పకుండా ఆయ‌న రాలేదు.

గుంటూరు పార్టీ కార్యాల‌యానికి ఆయ‌న స‌మాచారం అందించారు. తార‌క్‌.. జిల్లాలోని పాల‌ప‌ర్రులో ప‌ర్య టించారు. ఇది చిల‌క‌లూరిపేట‌, బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గాల‌కు మ‌ధ్య‌లో ఉంటుంది. అయితే.. ఈ కార్య‌క్ర‌మా నికి పేరెన్నిక‌గ‌న్న ఏ ఒక్క నాయ‌కుడు కూడా రాలేదు.

మ‌రి దీనిని ఎలా అర్ధం చేసుకోవాల‌నేది ప్ర‌ధాన విష‌యం. ఇక‌, పార్టీ మాదేన‌ని తార‌క్ అన్నా..కూడా ఈ విష‌యంపై కుటుంబం గ‌త 20 ఏళ్లలో ఏ నాడూ స్పందించ‌లేదు. అంటే.. తార‌క్ చెప్పిన విష‌యాలు కేవ‌లం ఆయ‌న‌కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యేలా ఉన్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.