Begin typing your search above and press return to search.
రోడ్డుపై నగ్నంగా బైక్ రైడింగ్ .. హైదరాబాద్ లో యువకుడి హల్‌చల్ !
By: Tupaki Desk | 12 March 2021 8:00 AM ISTనగ్నంగా నడిరోడ్డు పై రైడ్ చేయడం విదేశాల్లో కామన్ కావచ్చు. కానీ మన దేశంలో మాత్రం అలాంటివి కుదరదు. మతి స్థిమితం సరిగా లేని వ్యక్తులే ఒంటిపై నూలుపోగు లేకుండా బయట తిరుగుతుంటారు. హైదరాబాద్ నగరంలో ఓ యువకుడు నగ్నంగా బైక్ నడిపి హల్ చల్ క్రియేట్ చేశాడు. ఒంటిపై నూలు పోగు లేకుండా.. పల్సర్ బైక్ మీద రయ్‌మని దూసుకెళ్తూ, రోడ్డు మీద వెళ్తున్న వారికి షాకిచ్చాడు. ఊహించని ఈ పరిణామంతో వాహనదారులు, రోడ్డు మీద వెళ్తున్నవారు షాకయ్యారు. సికింద్రాబాద్ తిరుమలగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్మీ ఏరియా ఈ.ఎం.ఈ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై నగ్నంగా కూర్చొని.. వేగంగా దూసుకెళ్లాడు. వెనుక కారులో వెళ్తున్న కొందరు ఈ దృశ్యాలను ఫోన్లో చిత్రీకరించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... తిరుమలగిరి ప్రాంతంలో ఓ యువకుడు నగ్నంగా బైక్ నడిపాడు. మారేడ్‌పల్లి నుంచి నేరెడ్‌మెంట్ రూట్‌లో శరీరంపై బట్టలు లేకుండా సంచరించడంతో స్థానికులు షాక్ తిన్నారు. ఈ వ్యవహారంపై ఇన్ స్పెక్టర్ శ్రవణ్ కుమార్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ యువకుడు లంగర్ హౌస్ ప్రాంతంలో ఓ బైక్ ను చోరీచేశాడు. ఆ బైక్ పై లంగర్ హౌస్ నుంచి తిరుమల వైపు వచ్చాడు. ఆర్మీ రోడ్లపై నగ్నంగా తిరుగుతూ హల్‌చల్ చేశాడు. అనంతరం అదే బైక్ పై సనత్ నగర్ వైపు వెళ్లాడు. ఎవరూ లేని చోటు చూసి.. అక్కడే బైక్ వదిలిపెట్టి వెళ్లిపోయాడు. అతడు ఎందుకిలా చేశాడన్న దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు. మతిస్థిమితం లేకపోవడమే కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే , ఆ యువకుడు మతిస్థిమితం లేక ఇలా చేశాడా లేక స్నేహితులతో పందాలు కాసి అలా ప్రవర్తించాడా అనే విషయాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. ఏదేమైనా నగ్నంగా బైక్ పై దూసుకుపోవడం తో అది చూసిన నగర వాసులు మాత్రం దెబ్బకి షాక్ అయ్యారు.