Begin typing your search above and press return to search.

టీడీపీకి షాక్‌..వైసీపీకి నాగ్ ఫ్యాన్స్ మ‌ద్ద‌తు!

By:  Tupaki Desk   |   20 Aug 2017 10:25 AM GMT
టీడీపీకి షాక్‌..వైసీపీకి నాగ్ ఫ్యాన్స్ మ‌ద్ద‌తు!
X
నంద్యాల ఉప ఎన్నిక రాజ‌కీయం ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు పార్టీలు - కుల‌సంఘాల మ‌ద్ద‌తు ప్ర‌క‌ట‌న‌లు వెలువ‌డ‌గా తాజాగా అది సినీ అభిమానుల‌కు చేరింది. ఈ ఎపిసోడ్‌ లో ప్ర‌ధానంగా వైసీపీ ముందుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే నంద్యాల పోరులో ప్ర‌తిప‌క్ష వైసీపీకి సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు అభిమానులు మద్దతు ప్రకటించ‌గా ఈ వ‌రుస‌లో మ‌రో స్టార్ హీరో అభిమానులు మ‌ద్ద‌తు తెలిపారు. వైసీపీ అభ్య‌ర్థి శిల్పా మోహ‌న్ రెడ్డికి తాము మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ ప్ర‌క‌టించారు. వైసీపీ అభ్య‌ర్థికే త‌మ మ‌ద్ద‌తు అని అఖిలభారత అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అసిసోయేషన్ అధ్యక్షుడు ఏవీ నాగరాజు ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ఈ మ‌ద్ద‌తులో వైసీపీ శ్రేణులో ఫుల్ జోష్‌ లో ఉన్నాయి.

ప్రచారం గ‌డువు ముగిసిపోతుండ‌టంతో పాటుగా పోలింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో అధికార‌ - ప్ర‌తిప‌క్ష పార్టీలు ప్ర‌జ‌ల‌కు చేరువ అయేందుకు, త‌మ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకునేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకున్నాయి. ఈ క్ర‌మంలో అభిమాన సంఘాలు సైతం త‌మ స్టాండ్‌ ను స్ప‌ష్టం చేస్తున్నాయి. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్‌ రెడ్డికి మద్దతు ఉంటుంద‌ని తెలిపిన అఖిలభారత అక్కినేని నాగార్జున ఫ్యాన్స్ అసిసోయేషన్ అధ్యక్షుడు నాగ‌రాజు శిల్పా మోహ‌న్ రెడ్డిని గెలిపించాల‌ని అభిమానుల‌ను కోరారు. మ‌రోవైపు ఇప్ప‌టికే వైసీపీ నేత‌ - ప్రిన్స్ మ‌హేశ్ బాబు బాబాయ్ ఆదిశేష‌గిరిరావు మ‌హేశ్ ఫ్యాన్స్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా త‌మ మ‌ద్ద‌తు శిల్పాకే అని వారు ప్ర‌క‌టించారు. అంతేకాకుండా వారు క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారం కూడా చేస్తున్నారు.