Begin typing your search above and press return to search.

నగరిలో.....నగారా మోగించిన రోజా

By:  Tupaki Desk   |   31 Aug 2018 11:13 AM IST
నగరిలో.....నగారా మోగించిన రోజా
X
ఎమ్మెల్యే రోజా తన నియోజకవర్గం అయిన నగరిలో ఎన్నికల నగారా మోగించారు. గురువారం నాడు రోజా తన నియోజకవర్గం నగరిలో సొంత ఇల్లు కట్టుకుని గ్రుహప్రవేశం చేసారు. ఈ గ్రుహప్రవేశానికి వైఎస్ ఆర్‌ పీ నాయకులు - అభిమానులు బంధువుల హజారయ్యారు. తమిళనాడు నుంచి తన భర్త సెల్వమణి బంధువులు - స్నేహితులు కూడా పెద్ద ఎత్తున హజరయ్యారు. తన కొత్త ఇంటి గ్రుహప్రవేశానికి హజరైన అందరినీ పేరున పేరున పలకరించి - సందడి చేసారు. నగరి నియోజకవర్గంలోని ప్రజలు పెద్ద ఎత్తున హజరైనట్లు సమాచారం.

ఇకపై తన నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఆవిడ ఇక్కడ సొంత ఇంటి నిర్మాణం చేపట్టారని అభిమానులు అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రోజా నగరిలో ఎన్నికల నగరా మోగించినట్టే అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నగరిలో తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, అక్కడి ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం నేరుగా వచ్చి తనను సంప్రదించవచ్చునని రోజా అంటున్నారు. నగరి ఎమ్మెల్యే రోజా సొంత ఇంటి నిర్మాణం తమకు చాలా సంతోషం కలిగించిందని నగరిలో ప్రజలు - ఆమె అభిమానులు అంటున్నారు. రాబోయే సర్వత్రిక ఎన్నికలలో రోజా వైఎస్ ఆర్‌ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటి చేయనున్నారు. అందుకోసం రోజా ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. తన నియోజకవర్గమైన నగరిలో తన పార్టీని పటిష్టపరిచేందుకు రోజా సర్వశక్తులు ధారపోస్తున్నారు. నగరిలో రోజా సొంత ఇంటి నిర్మాణం ఆ నియోజకవర్గానికి చెందిన వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ చోట మోట శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కలిగించిందని ఆ పార్టీకి చెందని నాయకులు చెప్పారు ఈ శుభకార్యానికి హజరైన ప్రజలు - పార్టీ శ్రేణులు - అభిమానులు వైఎస్ ఆర్ కాంగ్రెస్ గెలుపు కోసం తాము క్రుషి చేస్తామని అన్నారు.