Begin typing your search above and press return to search.
నాగాలాండ్ వ్యక్తి కి అసోంలో కరోనా నిర్ధారణ: రాష్ట్రాల మధ్య కొట్లాట!
By: Tupaki Desk | 25 April 2020 8:45 AM ISTకరోనా మహమ్మారి పై ప్రపంచం, దేశం యావత్తు పోరాడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో చిన్న చిన్న చిక్కులు కూడా వచ్చి పడుతున్నాయి. ఈశాన్య భారతంలో కరోనా సోకిన వ్యక్తిని అధికారికంగా గుర్తించేందుకు రెండు రాష్ట్రాలు అంగీకరించడం లేదు. నాగాలాండ్‌కు చెందిన వ్యక్తికి అసోంలో కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. కానీ ఇప్పుడు ఆ రెండు రాష్ట్రాలు కూడా అతని బాధ్యతను తీసుకునేందుకు వెనుకాడుతున్నాయి. దీంతో అతని పేరు కరోనా రికార్డుల్లో లేదు.
నాగాలాండ్ దిమాపూర్ పట్టణానికి చెందిన 33 ఏళ్ల వ్యక్తికి ఆరోగ్యం విషమించడంతో ప్రయివేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అసోంలోని గౌహతి మెడికల్ ఆసుపత్రి లో చేర్పించారు. అయితే ఈ నెల 12వ తేదీన అతడు ఆసుపత్రిలో చేరిన తర్వాత కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అతను నాగాలాండ్ కు చెందిన వ్యక్తి కావడం తో అసోం అధికారికంగా రికార్డ్ చేయలేదు. అలాగే నాగాలాండ్ కూడా దూరంగా ఉంది.
అసోం ఆరోగ్య శాఖమంత్రి హిమంత్ బిశ్వశర్మ కరోనా లెక్కల్లో అతడి పేరును జత చేయలేదు. ఈ మేరకు అతను ట్వీట్ కూడా చేశారు. అదే సమయంలో నాగాలాండ్ ముఖ్యమంత్రి కూడా ఈ అంశంపై స్పందించారు. అతడిని లెక్కించే బాధ్యత అసోంకు సంబంధించింది అయితే తాను మాట్లాడనన్నారు. అలాగే నాగాలాండ్ కేసుగా తాము నమోదు చేయకపోవడాన్ని తప్పుబట్టవద్దని అభిప్రాయ పడ్డారు.
అతడిని సాధారణ రోగిగానే అక్కడకు పంపించామని, కానీ కరోనా ఉన్నట్లుగా అక్కడ గుర్తించారని నాగాలాండ్ సీఎం తెలిపారు. అతను కోల్‌కతా నుండి దిమాపూర్ పట్టణానికి వచ్చాడని, అనారోగ్యంతో గౌహతి ఆసుపత్రిలో చేరాడని తెలిపారు. అతడికి కరోనా ఉన్నట్లు అసోంలో గుర్తించారు కాబట్టి అక్కడే రికార్డ్ చేయాలని సూచించారు. అలా కాదంటే నాగాలాండ్ పంపిస్తే మాత్రమే తాము రికార్డుల్లో నమోదు చేస్తామన్నారు. దీనిపై ఇరు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు సాగుతున్నాయి.