Begin typing your search above and press return to search.

సెటైర్లు మ‌ళ్లీ మొద‌లుపెట్టిన నాగ‌బాబు

By:  Tupaki Desk   |   26 April 2022 11:21 AM GMT
సెటైర్లు మ‌ళ్లీ మొద‌లుపెట్టిన నాగ‌బాబు
X
మెగా బ్ర‌ద‌ర్ నాగాబాబు సోష‌ల్ మీడియాలో య‌మ యాక్టీవ్ గా వుంటూ ప్ర‌త్య‌ర్థుల‌పై సెటైరిక‌ల్ గా పంచ్ లు వేస్తుంటార‌న్న‌ది తెలిసిందే. నిహారిక ఇష్యూ త‌రువాత కొంత సైలెంట్ అయిన నాగ‌బాబు మ‌ళ్లీ సెటైర్లు వేయ‌డం మొద‌లు పెట్టారు. ఈ మ‌ధ్య నెట్టింట్లో క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్ సెష‌న్స్ పెడుతూ అస్క్ మీ ఎనీథింగ్ అంటూ హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. అభిమానులు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌ర‌దా స‌ర‌దా ఆన్స‌ర్ లు చెబుతూ నెట్టింట ర‌చ్చ చేస్తున్నారు.

సోష‌ల్ మీడియా ఇన్ స్టా వేదికగా 'ఆస్క్ మీ ఎనీ థింగ్' అంటూ నాగ‌బాబు అభిమానుల‌తో క్వ‌శ్చ‌న్ అండ్ ఆన్స‌ర్ సెష‌న్ ని నిర్వ‌హించారు. ఇక నెటిజ‌న్ లు అడిగే ప్ర‌శ్న‌ల‌కు త‌న‌దైన స్టైల్లో మీమ్స్ తో ట్రోల్స్ తో స‌మాధానం చెప్పిన తీరు న‌వ్వులు పూయిస్తోంది. ఇందులో బాగంగా వైస్ ఆర్ పార్టీపై , ఏపీ ముఖ్య‌మంత్రిపై, మంత్రుల‌పై నాగ‌బాబు వేసిన పంచ్ లు నెట్టింట వీర లెవెల్లో పేలుతున్నాయి. వీటికి నాగాబాబు వేసిన మీమ్స్ వేరే లెవెల్‌.

ఇటీవ‌ల జ‌రిగిన ఏపీ మంత్ర విర్గ విస్త‌ర‌ణ‌లో ఓ మంత్రి తన‌ ప‌ద‌విని వీడాల్సి వ‌చ్చింది. అయితే అత‌ని ప‌రిస్థితి ఏంటి గురువుగారు అని అడిగితే 'అఆ' చిత్రంలోని క్లైమాక్స్ లో రావు ర‌మేష్ , అజ‌య్ తో 'ఇంకేంటీ పిసుక్కోవ‌డ‌మే' అంటూ చెప్పే డైలాగ్ కు సంబంధించిన వీడియోని స‌మాధానంగా చూపించ‌డం మిలేరియ‌స్ గా న‌వ్వులు కురిపిస్తోంది. చాలా సీరియ‌స్ ప్ర‌శ్న‌ల‌కు కూడా నాగ‌బాబు ఫ‌న్నీ ఎమోజీలు, ఫొటోలు, వీడియోల‌తో పొట్ట చెక్క‌ల‌య్యేలా పోస్ట్ లు పెట్ట‌డం విశేషం.

ఇక్క‌డో విష‌యం చెప్పాలి. నాగ‌బాబు ప్రారంభించిన ఈ క్వ‌శ్చ‌న్ సెష‌న్ లో ఎక్కువ ప్ర‌శ్న‌లు ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌ జ‌గ‌న్‌, ఏపీ కొత్త మంత్రులు, పాత మంత్ర‌లతో పాటు జ‌న‌సేన‌, ప‌వ‌న్ క‌ల్యాణ్ ల‌పైనే అభిమానులు అత్య‌ధికంగా ప్ర‌శ్న‌లు సంధించారు. ఇక ఇందులో ఎడారిలో ఓయాసిస్సులా ఓ ఆస‌క్తిక‌ర‌మైన ప్ర‌శ్న నాగ‌బాబుకు ఎదురైంది. ఆ ప్ర‌శ్న ఆయ‌న కోరుకున్నారు కూడా. ఇలాంటి ప్ర‌శ్న ఎదుర‌వుతుంద‌ని ముందు నాగ‌బాబు ప‌సిగ‌ట్టి అదిరిపోయే స‌మాధానం చెప్పారు.

ట్రిపుల్ ఆర్‌, కేజీఎఫ్ 2 ల్లో మీకు ఏ సినిమా న‌చ్చింది అంటూ ఓ అభిమాని నాగ‌బాబుని అడిగారు. దీనికి నాగ‌బాబు వెరైటీగా స‌మాధానం చెప్పారు. లెజెండ‌రీ గ్రాఫిక్ సినిమా అని ప‌రోక్షంగా స‌న్ ఆఫ్ ఇండియా పై సెటైర్ వేశారు.

ఇటీవ‌ల మంచు మనోజ్ మెగా ఫ్యామిలీలో అంద‌రికి ప‌ని వుంద‌ని కానీ పాపం ఒక్క‌రికే ప‌ని లేద‌ని, అందుకే ఆయ‌న ఇలాంటి మాట‌లు మాట్లాడుతుంటార‌ని కామెంట్ చేసిన విష‌యం తెలిసిందే. తాజా స‌మాధానంతో నాగ‌బాబు ఆ విష‌యాన్ని ఇంకా విడిచిపెట్టినట్టులేద‌నే కామెంట్ లు వినిపిస్తున్నాయి. మ‌రి నాగ‌బాబు లెజెండ‌రీ సినిమా కామెంట్ పై ఎలాంటి ప్ర‌తిస్పంద‌న వ‌స్తుందో చూడాలి అని నెటిజ‌న్స్ అంటున్నారు.