Begin typing your search above and press return to search.

అచ్చెన్న అరెస్ట్ పై నాగబాబు షాకింగ్ ట్వీట్స్...!

By:  Tupaki Desk   |   13 Jun 2020 2:40 PM IST
అచ్చెన్న అరెస్ట్ పై నాగబాబు షాకింగ్ ట్వీట్స్...!
X
ఈఎస్ ఐ కుంభకోణం కేసులో శుక్రవారం మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అరెస్ట్ పై జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు ఇద్దరు స్పందించారు. గత టీడీపీ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలను ప్రస్తావిస్తూ ఆ పార్టీపై జనసేన నేత నాగబాబు మండిపడ్డారు. 'టీడీపీ హయాంలో టీడీపీ నాయకురాలిని సోషల్ మీడియాలో ఏదో అన్నారు అని మా జనసేన కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టి అరెస్ట్ చేసి, వాళ్లని గొడ్లని బాదినట్లు బాది, అంత హింస పెట్టిన టీడీపీ ఇప్పుడు ఒక నాయకుడి మీద స్కాం జరిగిందని పోలీసులు అరెస్ట్ చేస్తే మాత్రం టీడీపీ, టీడీపీ అనుకూల మీడియా అంత గగ్గోలు పెడుతున్నాయి' అని చెప్పారు.

'వాళ్లు కేవలం కార్యకర్తలు నాయకులు కారు అనేగా అప్పట్లో మీ ఉద్దేశం. కర్మకు మెనూ లేదు.. ఫలితాన్ని అనుభవిస్తారు. మా జనసేన కార్యకర్తలని అరెస్ట్ చేసి కొట్టించిన పాపం టీడీపీకి అంత తేలిగ్గా పోతుందా? మా జనసైనికుల పట్ల మీరు ప్రవర్తించిన తీరును మేము ఎన్నటికీ మర్చిపోము' అని నాగబాబు ట్విట్టర్‌ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే.. మెగా బ్రదర్ ట్వీట్ కి మిశ్రమ స్పందన వస్తోంది. సొంత పార్టీ కార్యకర్తలు కొందరు నాగబాబు ట్వీట్ కి మండిపడటం గమనార్హం. కొందరు మాత్రం మద్దతు పలికారు.