Begin typing your search above and press return to search.

నాగబాబు హర్ట్ : పవన్ మీద మరీ అంతలానా నానీ ...?

By:  Tupaki Desk   |   11 July 2022 9:53 PM IST
నాగబాబు హర్ట్ : పవన్ మీద మరీ అంతలానా నానీ ...?
X
మెగా బ్రదర్ కమ్ జనసేన నాయకుడు నాగబాబు హర్ట్ అయ్యారు. అయ్యారంటే అవరా మరి. ఆయన తమ్ముడు కమ్ జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ మీద మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని ఎన్ని మాటలు అన్నారని, అలా నవ్వుతూనే ఒక్కోటిగా అంటించేశారు. ఒకటి పవన్ అంటే నాలుగు తానూ అంటూ దాదాపుగా ఒక గంట పాటు మీడియా సమావేశంలో పవన్ని పేర్ని నాని బాగా వేసుకున్నారుగా.

దాంతో మండిపోయిన నాగబాబు వైసీపీ నాయకులు ప్రత్యేకించి పేర్ని నానికి నోటి విరేచనాలు పట్టుకున్నాయని ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ తినిపించిన ఆహారం జీర్ణం కాకనే ఆయన ఇలా నోటి విరేచనాలతో బాధపడుతున్నార‌ని, ఆయన్ని బందరులో దగ్గరలో ఉండే డాక్టర్ కి చూపించి సత్వర వైద్యం అందించాలని నాగబాబు కోరడం విశేషం.

మొత్తానికి పేర్ని నాని గంట మీడియా సమావేశానికి పవన్ని బాగా వేసుకున్న దానికి జస్ట్ నాలుగు లైన్ల ట్వీట్ తో నాగబాబు జవాబు చెప్పినా అందులో నాగబాబు ఎంత బాధపడ్డారు, ఆయన ఎంతలా హర్ట్ అయ్యారు అన్నది ఇట్టే తెలిసిపోతోంది అంటున్నారు. ఇంతకీ పేర్ని నాని ఏమన్నారు, నాగబాబు ఎందుకు అలా రియాక్ట్ అయ్యారు అన్నది ఒక్కసారి లుక్కేస్తే చాలానే కధ ఉంది మరి.

పేర్ని నాని ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ముందుగా వైసీపీ ప్లీనరీ గొప్పగా విజయవంతం అయింది జగనే మరోసారి ఈ రాష్ట్రానికి సీఎం కాబోతున్నారు అని గట్టిగా చెప్పారు. ఆ మీదట ఆయన మంగళగిరి పార్టీ ఆఫీలో జనవాణి సందర్భంగా పవన్ జగన్ సర్కార్ మీద హాట్ హాట్ కామెంట్స్ చేశారు. అలా చేసిన వాటిని ఏరి మరీ ఒక్కోదానికీ పేర్ని నాని బదులిచ్చారు. అది కూడా తనదైన శైలిలో వెటకారం కూడా దట్టించి మరీ గట్టిగానే కౌంటర్ ఇచ్చారు.

రౌడీలంటే నాకు చికాకు అని పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ కి పేర్ని నాని రిటార్ట్ ఏంటంటే అవును మరి మనం గత అయిదేళ్ళుగా తిరిగింది వారితోనే కదా అని. అంతే కాదు అనంతపురంలో ఆ మధ్య ఎవరింటికి వెళ్ళి తమరు ఫలహారం కాఫీ సేవించారు అని ప్రశ్నించారు. వారు ఎన్ని మర్డర్లు చేశారని కనుక్కోవడానికా, లేక బాగా చేశారని సత్కరించడానికా అని కూడా కామెంట్స్ చేశారు.

తాను అధికారంలో లేను కాబట్టి కౌరవుణ్ణి ఎలా అవుతాను అని పవన్ అన్న మరో దానికి పేర్ని కౌంటరేశారు. చంద్రబాబుతో కలసి గత అయిదేళ్ళు అధికారం పంచుకున్న తమరు నాడు కౌరవుడే కదా. ఇపుడు బీజేపీతో కలసి పొత్తులో ఉన్న తమరు దేశానికి కౌరవుడా అని నిలదీశారు. అధికారంలో ఉంటేనో లేకపోతే కౌరవులు అవరండీ పవన్ గారూ, మన బుద్ధులు, మనం ఎవరితో తిరుగుతున్నామో వారిని బట్టి కౌరవులు అంటారని పేర్ని నాని క్లాస్ పీకారు.

మహాభారతంలో కర్ణుడు మంచివాడే అయినా ఆయన దుష్టచతుష్టయంతో కలసి ఉండడం వల్లనే కౌరవులతో సమానంగా గుర్తించబడ్డాడని పవన్ తెలుసుకోవాలని సూచించారు. మంత్రులలో కులతత్వ భావన లేదు అని పవన్ అనడాన్ని తప్పు పట్టారు, కులభావన పోవాలని ఎవరైనా కోరుకుంటారు కానీ పవన్ ఇలా వింతగా మాట్లాడమేంటి అని పేర్ని నిలదీశారు

ఇక పవన్ కళ్యాణ్ పూటకోమాట ఊరికో మాట‌ మాట్లాడుతారని, ఆయన నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ రేపు ఉండదని పేర్ని నాని ఎద్దేవా చేశారు. తాను మాట్లాడింది తప్పు అయితే పవన్ కళ్యాణ్ 2014 నుంచి ఈ రోజు వరకూ ఏమేమి మాట్లాడింది తన వీడియో క్లిప్పింగ్స్ ఒక్కసారి అన్నీ చూస్తే చాలు ఆయన మీద ఆయనకే తాను ఏంటి అన్నది అర్ధమైపోతుందని పేర్ని నాని అనడం విశేషం.

పవన్ని అసెంబ్లీ గేటు తాకనీయకుండా చేసింది భీమవరం, గాజువాక ప్రజాలని, వైసీపీ వారికి మధ్యలో సంబంధం ఏంటని పేర్ని నాని ప్రశ్నించారు. పవన్ తాను చేయబోయే సినిమాలను ముందు పూర్తి చేసి అక్కడ సినిమా పాపాలను కడుక్కుని ఎన్నికలకు మూడు నెలల ముందు ఏపీలో రాజకీయానికి, చంద్రబాబుకు సాయానికి వస్తే సరిపోతుందని, నిర్మాతలైనా బాగుపడతారని పేర్ని నాని లాస్ట్ పంచ్ విసిరారు. మొత్తానికి పవన్ని ఒక రేంజిలో పేర్ని నాని చెడుగుడు ఆడించేసరికి నాగబాబుకు బాగా తన్నుకొచ్చింది కోపం అంటున్నారు. అందుకే నోట్లో విరేచనాలతో పేర్ని నాని బాధపడుతున్నారు అని మెగా బ్రదర్ అలా రివర్స్ కౌంటరేశారు అంటున్నారు.