Begin typing your search above and press return to search.

పీకలు కోస్తుంది.. నాగబాబు వార్నింగ్

By:  Tupaki Desk   |   23 Feb 2019 12:29 PM IST
పీకలు కోస్తుంది.. నాగబాబు వార్నింగ్
X
మెగా బ్రదర్ నాగబాబు మరో సారి రెచ్చిపోయారు. యూట్యూబ్ లో ‘మై చానెల్ నా ఇష్టం ’ పేరుతో ఆయన విడుదల చేస్తున్న వీడియోలు సంచలనమవుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో అధికార - ప్రతిపక్షాల విమర్శలను నాగబాబు తన చానెల్ ద్వారా సెటైరికల్ గా ఎండగడుతూ గుక్కతిప్పుకోనీయకుండా చేస్తున్నారు.

తాజాగా తన తమ్ముడు పవన్ - జనసేన పార్టీపై తప్పుడు కథనాలు రాస్తున్న మీడియాకు తన వీడియోలో హెచ్చరికలు జారీ చేశారు. హిట్లర్ -గోబెల్స్ పిట్ట కథను చెబుతూ పవన్ కళ్యాణ్ పార్టీ టీడీపీలో విలీనం అంటూ గోబెల్స్ ప్రచారం చేస్తున్నవారికి వార్నింగ్ ఇచ్చారు.

హిట్లర్ రెండో ప్రపంచ యుద్ధం సమయంలో తన రాక్షసత్వాలను కాపాడుకునేందుకు ‘గోబెల్స్’ అనే మంత్రి ద్వారా హిట్లర్ తప్పుడు ప్రచారాలు చేసుకొని లబ్ధి పొందాడని.. ఇప్పుడు ఏపీలోని రాజకీయ పక్షాలు - వారి అనుకూల మీడియా గోబెల్స్ ను మించి జనసేనను - పవన్ పై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని నాగబాబు మండిపడ్డారు.

గోబెల్స్ టైంలో వేరే మీడియా లేదని.. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ఉందని.. జనసేనను వాల్లు ఎంత తొక్కేసినా.. మానసికంగా జనసైనికులను దెబ్బ తీసినా సోషల్ మీడియా ద్వారా తాము ఎండగడుతామని నాగబాబు స్పష్టం చేశారు.

పవన్ కళ్యాణ్ టీడీపీతో కలిసిపోయామని వైసీపీ వాళ్లు.. వైసీపీతో కలిశాడని టీడీపీ వాళ్లు.. కొందరేమో బీజేపీతో కలిశాడంటున్నారని.. పవన్ అంత ఓపెన్ గా తాను ఒంటరిగా పోటీచేస్తానని చెప్పినా వాళ్లకు సెన్స్ లేకుండా తప్పుడు ప్రచారం చేస్తారని నాగబాబు మండిపడ్డారు. మాఫియాల పేరుతో దోచుకునే వ్యక్తి పవన్ కాదని.. జెన్యూన్ గా ప్రభుత్వాన్ని ప్రజలకు అందించాలని ముందుకొస్తున్నాడని నాగబాబు కొనియాడారు.

ఇక పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గుర్తు ‘గాజు గ్లాస్’పై కూడా నాగబాబు హాట్ కామెంట్ చేశారు. గాజు గ్లాస్ నీల్లు తాగడానికి ఉపయోగపడుతుందని.. అదే సమయంలో పగిలిపోతే పీకలు కూడా కోస్తుందని ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు. గాజు గ్లాస్ కు అధికార,ప్రతిపక్షం అనే ఆలోచన దానికి ఉండదని.. గ్లాసుని పగలకొట్టాలని చూసినా.. పగిలినా ఆ గాజు పెంక ఆయుధంగా మారి పీకలు కోస్తుంది బీ కేర్ ఫుల్ అంటూ నాగబాబు హెచ్చరించారు.