Begin typing your search above and press return to search.

జ‌గ‌న్‌.. దుర్మార్గ‌పు సీఎం.. మెగా బ్ర‌ద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By:  Tupaki Desk   |   14 March 2022 9:15 PM IST
జ‌గ‌న్‌.. దుర్మార్గ‌పు సీఎం.. మెగా బ్ర‌ద‌ర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌పైన‌, వైసీపీ పాల‌నపైనా మెగా బ్ర‌ద‌ర్, జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ స‌భ్యుడు.. నాగబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న జీవితంలో ఇప్ప‌టి వ‌ర‌కు మంచి సీఎంల‌ను చూశాన‌ని.. అదేవిధంగా చెడ్డ ముఖ్య‌మంత్రుల‌ను కూడా చూశాన‌ని.. కానీ.. ఒక దుర్మార్గ‌మైన ముఖ్య‌మంత్రిని చూడ‌డం ఇదే తొలిసార‌ని.. ఆ దుర్మార్గుడు ఎవ‌రో కాదు.. ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి జ‌గ‌నేన‌ని.. నిప్పులు చెరిగారు. రాజ‌ధాని లేకుండా.. రాష్ట్రాన్ని మూడేళ్ల‌పాటు పాలించిన ఘ‌న చ‌రిత్ర జ‌గ‌న్‌కు మాత్ర‌మే సొంత‌మ‌ని ఎద్దేవా చేశారు.

జ‌న‌సేన పార్టీ 9వ ఆవిర్భావ స‌భ‌.. గుంటూరు జిల్లా మంగ‌ళగిరి స‌మీపంలోని ఇప్ప‌టం గ్రామంలో జ‌రుగుతోంది. ఈ స‌భ‌లో పాల్గొన్న నాగ‌బాబు మాట్లాడుతూ.. వైసీపీపై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. సీఎం జ‌గ‌న్‌ను మ‌రోసారి గెలిపిస్తే.. రాష్ట్ర ప్ర‌జ‌లు కాందిశీకుల మాదిరిగా.. పొరుగు రాష్ట్రాల‌కు వెళ్లి త‌ల‌దాచుకునే ప‌రిస్థితి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు.

ఏపీలో ఇప్పుడు ఎటు చూసినా.. అప్పులు.. క‌ష్టాలే క‌నిపిస్తున్నాయ‌ని.. నాగ‌బాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ర‌హ‌దారుల ప‌రిస్థితి అత్యంత అధ్వానంగా ఉంద‌ని.. ఈ రోడ్ల‌పై వెళ్తుంటే.. పాడెపై వెళ్తున్న‌ట్టే ఉంద‌ని తీవ్ర‌స్థాయిలో నిప్పులు చెరిగారు.

దొంగ‌లు రెండు ర‌కాలుగా ఉంటార‌ని నాగ‌బాబు చెప్పుకొచ్చారు. అయితే.. రాజ‌కీయ దొంగ‌ల‌ను మ‌న‌మే ఎన్నుకుంటున్నామ‌ని.. చుర‌క‌లు అంటించారు. రాజ‌ధాని లేకుండా మూడేళ్లు పాలించిన జ‌గ‌న్ రికార్డును ఎవ‌రూ బ్రేక్ చేయ‌లేర‌ని మెగా బ్ర‌ద‌ర్ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు.

ప్ర‌జ‌లు ఇప్ప‌టికైనా ఆలోచించుకోవాల‌ని.. త‌మ జీవితాల‌ను మార్చే నాయ‌కులు కావాలో.. ఏమార్చే నాయ‌కులు కావాలో.. నిర్ణ‌యించుకోవాల‌ని.. నాగ‌బాబు త‌న‌దైన శైలిలో స‌టైర్లు గుప్పించారు. ప్ర‌జ‌లు అవినీతి ప‌రులు కాకుండా.. ఎన్నిక‌ల్లో ప్ర‌జాప్ర‌తినిధుల‌ను ఎన్నుకుంటే.,. ప్ర‌శ్నించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని .. నాగ‌బాబు తేల్చి చెప్పారు.

ఇదిలావుంటే, తొమ్మిదేళ్ల కింద ఆవిర్భవించిన జ‌న‌సేన‌ పార్టీ.. 2014 ఎన్నికల్లో పోటీచేయకుండా టీడీపీ-బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించింది. 2019 ఎన్నికల్లో వామపక్షాలు, బీఎస్పీతో కలిసి పోటీ చేసినప్పటికీ కేవలం ఒక్క స్థానంలో విజ‌యంతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఆ అనుభవాల దృష్ట్యా ఈసారి పకడ్బందీ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని పార్టీ నాయకత్వం భావిస్తోంది. అది కూడా ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచే వ్యూహాలను రూపొందించుకోవాలని యోచిస్తోంది.