Begin typing your search above and press return to search.
పవన్ పక్కన ఆయన ఎక్కడ? బెడిసికొట్టిందా..
By: Tupaki Desk | 18 Feb 2020 12:00 PM ISTజనసేన పార్టీ పెట్టిన అనంతరం ఆ పార్టీలో వలసలు భారీగా వస్తాయనుకుంటే నామమాత్రపు చేరికలు వచ్చాయి. ఆ చేరిన వారు కూడా ఎంతోకాలం పార్టీలో ఉండలేకపోయారు. ఎందుకంటే పవన్ రాజకీయాలు అలా ఉంటాయి. ఎవరికీ అర్థం కావు. ఈ క్రమంలోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ చివరి స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఇంకొందరితో కాంగ్రెస్ నుంచి జనసేన పార్టీలో చేరారు. అప్పటి నుంచి పవన్ కల్యాణ్ కొంత రాజకీయ శిక్షణ ఇస్తున్నారు. అపరిపక్వత నుంచి పరిపక్వత వైపు తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆ నేపథ్యంలోనే పవన్ కు కుడి భుజంగా ఆయన మారారు. అయితే ఇటీవల పరిణామాలు చూస్తుంటే వీరి మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది.
ఎందుకంటే ఇటీవల మూడు, నాలుగు రోజుల పాటు పవన్ కల్యాణ్ కర్నూలు, అమరావతి, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో పర్యటించాడు. పార్టీ నాయకులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అయితే అక్కడ పవన్ కల్యాణ్ పక్కన ఉండాల్సిన నాదెండ్ల మనోహర్ కనిపించలేదు. ఒక్కరోజు అంటే ఏమో మూడు రోజుల పాటు పవన్ కల్యాణ్ చేసిన పర్యటనల్లో మనోహర్ కనిపించకపోవడం హాట్ టాపికైంది. ఇటీవల జనసేన నుంచి జేడీ లక్ష్మీనారాయణతో పాటు పలువురు నాయకులు బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో నాదెండ్ల కూడా పార్టీ వీడుతున్నారనే ప్రచారం సాగుతోంది. దానికి పవన్ కల్యాణ్ వైఖరే కారణంగా తెలుస్తోంది.
తనకు అప్పులు ఉన్నాయని, వాటిని తీర్చడానికి సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఆ మేరకు మూడు సినిమాలను వరుసగా లైన్ లో పెట్టాడు. ఈ నిర్ణయం పార్టీలోని నాయకులకు నచ్చలేదు. అందుకే పార్టీలోని కీలక నాయకుడి గా ఉన్న జేడీ లక్ష్మీనారాయణ ఇదే విషయాన్ని ఉటంకిస్తూ పార్టీకి రాజీనామా చేశారు. సినిమాలు చేయడం తనకు నచ్చలేదని స్పష్టంగా.. బహిరంగం గా చెప్పారు. పార్టీలోని నాయకులకు కూడా ఈ విషయం పై బేధాభిప్రాయాలు ఉన్నాయి. కానీ బయట పెట్టడం లేదు. ఈ విషయంలో నాదెండ్ల మనోహర్ కు కూడా ఇష్టం లేదు.
రెండు పడవల పైన నడవడం ఎందుకు.. రాజకీయాల్లో ఉంటూ అధికార పార్టీ పై తీవ్రంగా పోరాడి సత్ఫలితాలు పొందవచ్చు.. అని చిలకకు చెప్పినట్లు నాదెండ్ల మనోహర్ పవన్ కు చెప్పినా పట్టించుకోలేదని పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. సినిమాల్లోకి వెళ్లితే రాజకీయాలు చేయలేం.. ఫుల్ టైం రాజకీయాల్లోనే ఉండు.. సినిమాలు వద్దు అని తెలిపినట్లు సమాచారం. అయితే ఈ సలహాను పవన్ పట్టించుకోకుండా సినిమాల్లో నటిస్తానని ప్రకటించాడు. దీంతో మనస్తాపానికి గురైన నాదెండ్ల మనోహర్ పవన్ కు దూరంగా ఉన్నట్టు తెలుస్తోంది. తన భవిష్యత్ చూసుకునే ఆలోచన చేస్తున్నట్లు.. త్వరలోనే పార్టీ నుంచి బయటకు వచ్చే అవకాశం కూడా ఉంది.