Begin typing your search above and press return to search.
జనసేన కామెడీలు, అన్నీ ఆ పార్టీ వల్లనేనట!
By: Tupaki Desk | 5 March 2020 9:00 PM ISTఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తామే కారణమని చెప్పుకు తిరిగారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేసి ఉంటే.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చేదా? అంటూ ఒక వెర్రి లాజిక్ ను ఎత్తాడు ఆ మధ్య పవన్ కల్యాణ్. ఆయనను బీజేపీ, టీడీపీలతో కలిసి పోటీ చేయవద్దని ఎవరూ అడగ లేదు! వేరేగా వెళ్తే ఏదో చేసేయవచ్చు అనే లెక్కలతోనే వేర్వేరు గా పోటీ చేశారు. కానీ వాళ్ల లెక్కలు చిత్తు అయ్యాయి. అయినా వైసీపీకి అధికారం తను వేసిన భిక్ష అంటూ పవన్ కల్యాణ్ చెప్పుకు తిరుగుతూ ఉంటారు.
అలా మాట్లాడితే ఎవరైనా నవ్వుతారనే భయం పవన్ కు లేనట్టుంది. కనీసం ఎమ్మెల్యేగా నెగ్గలేక, రెండు చోట్ల పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్.. అలా మాట్లాడటం కామెడీనే నిస్సందేహంగా. అయితే జనసేన ఈ తరహా కామెడీ లు చేస్తూనే ఉంది.
ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ అలాంటి కామెడీనే చేశారు. అదేమిటంటే.. తమ మద్దతు లేకపోతే 2014లో తెలుగుదేశం పార్టీ ఏపీలో అధికారంలోకి వచ్చేదికాదని అంటున్నారాయన. అంటే 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికీ తామే కారణమంటారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికీ తామే కారణమంటారు.. ఇదీ జనసేన వాళ్ల మాటతీరు. ఏపీలో ఏం జరిగినా అది తమ వల్లనే అని జనసేన కామెడీ చేస్తూ ఉంది.
అయితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అది తమ వల్లనే అని ప్రకటించుకున్న ఆ పార్టీ మాత్రం నెగ్గలేక పోయింది. 2014లో పోటీనే చేయలేదు. 2019లో పొత్తులతో పోటీ చేస్తే.. చివరకు దక్కింది ఒక్క ఎమ్మెల్యే సీటు! అధినేతే ఓడి పోయాడు. అయినా.. అంతా తమ వల్లనే అంటూ జనసేన కామెడీలు కొనసాగుతూ ఉన్నాయి!