Begin typing your search above and press return to search.

అమ‌రావ‌తి పేరుతో ప‌వ‌న్ కు త‌మ్ముడి శాప‌నార్థాలు!

By:  Tupaki Desk   |   31 July 2018 3:52 PM IST
అమ‌రావ‌తి పేరుతో ప‌వ‌న్ కు త‌మ్ముడి శాప‌నార్థాలు!
X
కొత్త త‌ర‌హా రాజ‌కీయాల్ని ప్ర‌ద‌ర్శిస్తున్నారు తెలుగు త‌మ్ముళ్లు. త‌మ రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌పై దుమ్మెత్తి పోయిటం.. అది కూడా సాధ్యం కాక‌పోతే.. దిగ‌జారి మ‌రీ విమ‌ర్శ‌లు చేయ‌టం అంత‌కంత‌కూ పెరుగుతోంది. త‌మ విమ‌ర్శ‌ల‌కు సెంటిమెంట్ సెంటు రాస్తున్న త‌మ్ముళ్ల మాట‌లు ఇప్పుడు చిత్రంగా ఉండ‌టం గ‌మ‌నార్హం.

ఓవైపు దేవుళ్ల‌ను చుల‌క‌న చేసేలా త‌మ పార్టీ నేత‌లు మాట్లాడుతున్న వైనాన్ని ప‌ట్టించుకోని తెలుగు త‌మ్ముళ్లు. అందుకు భిన్నంగా త‌మ రాజ‌కీయ ప్రత్య‌ర్థుల‌పై దారుణ వ్యాఖ్య‌లు చేస్తున్నారు. ఆ మ‌ధ్య‌న తిరుమ‌ల శ్రీ‌వేంక‌టేశ్వ‌ర‌స్వామిని ఉద్దేశించి సినీ న‌టుడు క‌మ్ రాజ‌మండ్రి ఎంపీ ముర‌ళీమోహ‌న్ ఎలాంటి వ్యాఖ్య‌లు చేసి విమ‌ర్శ‌ల్లోకి కూరుకుపోయింది తెలిసిందే.

గురివింద చందంగా ఇలాంటి న‌లుపును ప‌ట్టించుకోని తెలుగు త‌మ్ముళ్ల వ్యాఖ్య‌లు ఎలా ఉంటాయో తెలియాలంటే.. తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడ‌రేష‌న్ అధ్య‌క్షుడు నాదెండ్ల బ్ర‌హ్మం చౌద‌రి మాటల్ని నిద‌ర్శ‌నంగా చెప్పాలి. అమ‌రావ‌తిని వ్య‌తిరేకించిన సుష్మా స్వ‌రాజ్‌.. అరుణ్ జైట్లీలు కిడ్నీ స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నార‌న్నారు. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో త‌మ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌ల‌పెట్టిన భూసేక‌ర‌ణ‌ను వ్య‌తిరేకించిన సామాజికవేత్త కిడ్నీలు ఫెయిల్ అయి ఎలా మ‌ర‌ణించారో అంద‌రికి తెలిసిందేనన్నారు.

అమ‌రావ‌తిని కాపాడేందుకు అమ‌రావ‌తి అమ‌ర‌లింగేశ్వ‌ర‌స్వామి.. ఇంద్ర‌కీలాద్రి క‌న‌క‌దుర్గ‌మ్మ అండ ఉంద‌ని.. ఏపీ రాజ‌ధానిని ఆ ఇద్ద‌రు దేవుళ్లు కాపాడుకుంటార‌న్నారు. ఇప్ప‌టికైనా ప‌వ‌న్ క‌ల్యాణ్ రాజ‌ధాని అమ‌రావ‌తి గురించి మాట్లాడేట‌ప్పుడు ఆచితూచి మాట్లాడాల‌ని.. అన‌వ‌స‌రంగా నోరు పారేసుకుంటే అందుకు త‌గ్గ మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌న్నారు.

ఇత‌గాడి మాట‌లు వింటున్న సామాన్యుల‌కు వ‌స్తున్న సందేహాల‌కు స‌మాధానాలు చెప్పే వారే క‌నిపించ‌ని ప‌రిస్థితి. విజ‌య‌వాడ అభివృద్ధి పేరుతో పెద్ద ఎత్తున దేవాల‌యాలు.. మ‌సీదులు.. చ‌ర్చిల‌ను కూల‌గొట్ట‌టంపై భ‌గ‌వంతుడు సంతోషంగా ఉన్నారా? తిరుమ‌ల శ్రీ‌వారికి కులాన్ని ఆపాదించిన తెలుగు త‌మ్ముళ్లు.. దేవుళ్ల గురించి మాట్లాడ‌తారా? అని ప్ర‌శ్నిస్తున్నారు.