Begin typing your search above and press return to search.
ఇదేంటి బాబు.. టంగ్ స్లిప్ లో కొడుకుతో పోటీనా!
By: Tupaki Desk | 22 Sept 2017 11:05 AM ISTజయంతిని వర్ధంతి చేస్తారు! అంతేకాదు వర్ధంతి రోజు శుభాకాంక్షలు చెబుతారు! రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ తాగునీరు లేని ఇబ్బంది ఏర్పాటుచేస్తానని హామీలు ఇస్తారు! మత పిచ్చి కులపిచ్చి ఇవన్నీ ఉన్నాయంటే అది కేవలం టీడీపీకే ఉన్నాయంటూ నిజాలు చెప్పేస్తారు!.. ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా!! లెక్కలేనన్ని ఆణిముత్యాలు వెతుక్కో వచ్చు ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు - మంత్రి లోకేష్ ప్రసంగాల్లో!! తనకు ఇంతవరకూ దక్కని `ఘనత` తన కొడుక్కి దక్కడం చూసి ఏమనుకున్నారో ఏమోగానీ.. చంద్రబాబు కూడా తనయుడు లోకేశ్ బాటలో పయనిస్తున్నారు! కొడుకుతో పోటీపడుతూ.. తానేమీ తక్కువ తినలేదని నిరూపిస్తున్నారు. అంతేకాదు లోకేశ్ నే మించిపోయారు!
ఇన్నాళ్లూ చినబాబు స్టేజీల మీద తన `భాషా పాండిత్యాన్ని` అందరికీ వినిపిస్తే.. ఇప్పుడు తానేమీ తక్కువ తినలేదని నిరూపించుకున్నారు చంద్ర బాబు! తన అధికారిక ట్విటర్ పేజీలోనే తడబడి.. నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయారు! అందరూ చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని పనిచేయాలని లెక్చర్లు మీద లెక్చర్లు ఇచ్చేస్తుంటే... ఆయన మాత్రం కొడుకును ఆదర్శంగా తీసుకుంటున్నారేమో అనిపించకమానదు ఈ ట్వీట్ చదివితే!! తడబడటంలో తన కుమారుడికి పోటీ వస్తున్నారు. సాక్షాత్తూ తన అధికారిక ట్విటర్ పేజీలో అచ్చు తప్పు పెట్టి విమర్శలపాలయ్యారు.
బహిరంగ వేదికలపైనా - పార్టీ సమావేశాల్లో పొరపాటుగా మాట్లాడటం ‘చినబాబు’కు అలవాటుగా మారింది. తాజాగా చంద్ర బాబు కూడా తప్పులో కాలేశారు. ఆపదలో ఉన్న మహిళలను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం గురువారం 181 కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఇంతవరకు బాగానే ఉంది. ఈ విషయాన్ని తెలుపుతూ సీఎం చంద్రబాబు ట్విటర్ లో పోస్ట్ పెట్టారు. ‘ఆపదలో ఉన్న మహిళలను ఆడుకోవడమే లక్ష్యంగా 181 కాల్ సెంటర్ ఏర్పాటు చేశాము. గృహహింస - ఈవ్ టీజింగ్ - హ్యూమన్ ట్రాఫికింగ్ సమస్యలకు పరిష్కారమవుతాయ’ని ట్వీట్ చేశారు. మహిళలను ఆదుకోవడం అనడానికి బదులు ఆడుకోవడం అని పేర్కొన్నారు. ఇక నెటిజన్లు ఊరుకుంటారా చెప్పండి! బాబుగారి మీద సెటైర్లు మొదలుపెట్టారు.