Begin typing your search above and press return to search.

మాజీ సీఎం మేనల్లుడి హత్యకేసులో వీడిన మిస్టరీ

By:  Tupaki Desk   |   2 Feb 2021 11:30 PM GMT
మాజీ సీఎం మేనల్లుడి హత్యకేసులో వీడిన మిస్టరీ
X
కర్ణాటక మాజీ సీఎం ధరమ్ సింగ్ మేనల్లుడు సిద్ధార్థ హత్య కేసు మిస్టరీ వీడింది. సిద్ధార్థను హత్య చేసిన అనంతరం నిందితులు మృతదేహాన్ని నెల్లూరు జిల్లా రాపూరు గుండవోలు అటవీ ప్రాంతంలో పూడ్చి పెట్టారని తేలింది.ఇప్పటికే ఈ హత్యకు ప్రధాన కారకులను బెంగళూరు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఒకరు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. మరో నిందితుడు వినోద్ ను కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేశారు.

గతనెల 19న సిద్ధార్థ్ అమెరికా వెళ్తున్నాని చెప్పాడు. అనంతరం అతడి ఫోన్ స్విచ్ఛాఫ్ అయ్యింది. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిద్ధార్థ్ ను ఇద్దరు వ్యక్తులు హత్య చేసి నెల్లూరు జిల్లా రావూర్ అడవిలో పూడ్చి పెట్టినట్టు పోలీసులు గుర్తించారు.

ఇద్దరు నిందితుల్లో ఇకడైన వినోద్ తిరుపతి-రేణిగుంట మార్గంలో రైలు కిందపడడానికి యత్నించగా కాలు, చేయి విరిగింది. స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఇక నాలుగు రోజుల కిందటే మరో నిందితుడు శ్యాంసుందర్ రెడ్డి తిరుపతిలో సూసైడ్ చేసుకున్నాడు. వినోద్ ను నెల్లూరు తీసుకొచ్చి సిద్ధార్థ్ శవాన్ని తవ్వి పోలీసులు పోస్టుమార్టం నిర్వహించారు.