Begin typing your search above and press return to search.

సుశాంత్ కేసు:మహారాష్ట్ర వర్సెస్ బీజేపీ రాష్ట్రాల ఫైట్

By:  Tupaki Desk   |   2 Aug 2020 2:00 PM GMT
సుశాంత్ కేసు:మహారాష్ట్ర వర్సెస్ బీజేపీ రాష్ట్రాల ఫైట్
X
బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. మాటల యుద్ధానికి దారితీస్తోంది. సుశాంత్ సింగ్ స్వస్థలం బీహార్ రాష్ట్రం. ఆయన సినిమా అవకాశాల కోసం ముంబై వచ్చి ఇక్కడే హీరోగా స్థిరపడ్డాడు. సినీ మాఫియాకు బలయ్యాడన్న ఆరోపణలున్నాయి. సుశాంత్ ఆత్మహత్యపై ముంబై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలోనే నిజాలు వెల్లడికావడం లేదు.

ఈ కేసు విషయంలో మహారాష్ట్ర పోలీసుల జాప్యంపై బీహార్ గుర్రుగా ఉంది. మహారాష్ట్ర, బీహార్ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. అటు మహారాష్ట్రతోపాటు బీహార్ పోలీసులు కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తుండడం సంచలనమైంది.

తాజాగా బీహార్ పోలీసులు ముంబైకి రావడం.. ముంబై పోలీసులు వారిని అడ్డుకొని వెనక్కిపంపడం వివాదానికి దారితీసింది.

ఇక సుశాంత్ ఆత్మహత్య కేసులో శివసేన సీఎం ఉద్దవ్ ఠాక్రే విఫలమయ్యాడని ప్రతిపక్ష బీజేపీ విమర్శిస్తోంది. బీజేపీ నేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ తాజాగా బాలీవుడ్ మాఫియా ఒత్తిడి వల్లే సుశాంత్ ఆత్మహత్య కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం నిజాలు వెల్లడించడం లేదని ఆరోపించారు. బీహార్ పోలీసులకు కేసు అప్పగిస్తే నిజాలు నిగ్గు తేలుతాయని సవాల్ చేశారు. ముంబై పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు. కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు.

దీనికి మహారాష్ట్ర సీఎం ఠాక్రే కౌంటర్ ఇచ్చారు. ముంబై పోలీసుల విశ్వసనీయతను దెబ్బ తీస్తున్న బీజేపీ నేతల తీరుపై మండిపడ్డారు. ఈ ఆరోపణలను ఖండించారు. దోషులకు శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. ఈ సుశాంత్ కేసు ఇప్పుడు మహారాష్ట్ర వర్సెస్ బీజేపీ రాష్ట్రాల ఫైట్ గా మారిపోయింది.