Begin typing your search above and press return to search.
ఎనిమిది మంది మిస్టరీ మరణం..ఇల్లు వల్లకాడు ఎలా అయిందంటే..!
By: Tupaki Desk | 25 Dec 2019 1:30 AM GMTఓ ఇల్లు వల్లకాడు అయిపోయింది. ఒకరి తర్వాత మరొకరు అన్నట్లుగా - స్వల్పకాలంలోనే ఎనిమిది మంది కన్నుమూశారు. ఆరుగురు కుమారులు - భర్త - మనవడిని మృత్యువు బలి తీసుకోవడంతో...ఈ ఇంట్లో ఇప్పుడు శ్మశాన నిశ్శబ్ధం ఆవరించింది. కుటుంబ పెద్ద అయిన ఆ ఇల్లాలు తల్లడిల్లిపోతోంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని శాస్త్రినగర్‌కు చెందిన రహిమున్నీసాబేగం ఇలా కుటుంబ సభ్యులను కోల్పోయి ఆవేదనలో ఉంది.
రహిమున్నీసాబేగం - ఆమె భర్త షేక్ ఖరీం దంపతులకు ఎనిమిది మంది సంతానం. ఈ కుటుంబంలో ఒకరి తర్వాత మరొకరు కన్ను మూస్తుండటంతో ఆ కుటుంబం కష్టాల పాలయింది. పుట్టిన మూడేళ్లకే మూర్చ వ్యాధితో పెద్ద కుమారుడు వకీల్ మృతిచెందాడు. అనంతరం కొద్దికాలానికి రహిమున్నీసా భర్త షేక్ ఖరీం ఊపిరితిత్తులు దెబ్బతిని మృతి చెందాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు మూడో కుమారుడు ఇర్ఫాన్ ఊపిరితిత్తుల వ్యాధితో చనిపోయాడు. ఇది జరిగిన తర్వాత దాదాపు మూడేళ్లకు రెండో కుమారుడు షేక్ ఇమ్రాన్ కు ఆటో ప్రమాదంలో తీవ్ర గాయాలతో మంచానికే పరిమితమై కన్నుమూశాడు. అయితే, వివాహితుడైన ఇమ్రాన్‌కు ఇద్దరు పిల్లలు. వారు పుట్టిన 12 రోజులకే కన్నుమూశారు.
మరో కొడుకును సైతం దురుదృష్టకరమైన రీతిలో రహిమున్నీసా కోల్పోయింది. ఆరో కొడుకు ముబీన్ ఆటోను కడిగే క్రమంలో గుండ్ల చెరువులో పడి కన్నుమూశాడు. నాలుగో కుమారుడు షేక్ ఇజాజ్ దాదాపు ఏడాది క్రితం గుండె పోటుతో చనిపోయాడు. ఇక ఆమె ఐదో కుమారుడు ముజాహిద్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. తన భర్త - కుమారులు - మనవడి మరణంతో తీవ్ర దుఖఃలో మునిగిపోయిన ఆమెకు మరో కష్టం ఎదురైంది. రహిమున్నిసా భేగం తల్లి రెండ్రోజుల కిందట కన్నుమూసింది. ఇలా 24 ఏళ్లలో తొమ్మిది మంది ఆ కుటుంబంలో మృత్యువాత పడాగా.. గత 12 ఏళ్లలో ఏడుగురు చనిపోయారు. గడిచిన రెండున్నరేళ్లలోనే నలుగురు కన్నుమూశారు.
అయితే, ఇలా వరుసగా జరుగుతున్న దారుణమైన పరిణామాలతో రహిమున్సిసా తన ఇంటిలో దోషం ఏమైనా ఉందేమోనని...నివాసాన్ని మార్చింది. కానీ ప్రయోజనం లేదు. ఆమె ఇల్లు మారిన కొద్దిరోజులకే కన్నతల్లి కన్నుమూసింది. మిగిలిన ఇద్దరు కుమారులతో జీవితాన్ని నెట్టుకువచ్చేందుకు ప్రయత్నిస్తుండగా... ఓ కుమారుడు జావిద్ మైనర్ అని పని చేస్తుంటే అధికారులు అడ్డుకుంటున్నారట. తీవ్రమైన కష్టాల్లో ఉన్న తమను ఆదుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది.