Begin typing your search above and press return to search.

ఎంపీల‌తో భేటీ.. జ‌గ‌న్ ఆలోచ‌న ఏంటి...?

By:  Tupaki Desk   |   29 Sep 2021 4:30 PM GMT
ఎంపీల‌తో భేటీ.. జ‌గ‌న్ ఆలోచ‌న ఏంటి...?
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌.. త‌న పార్టీకి చెందిన 21 మంది (ఒక‌రు ర‌ఘురామ‌రాజు)తో ఈ రోజు నుంచి భేటీ అవుతున్నా రు. కొంద‌రికి మ‌ధ్యాహ్నం లంచ్ కూడా ఏర్పాటు చేసిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు తెలిపాయి ఈ భేటీలో జగ‌న్ ఏం చ‌ర్చించ‌బోతున్నారు? వారితో ఏ విష‌యాల‌ను ప్ర‌స్తావించ‌నున్నారు ? అనేది ఆస‌క్తిగా మారిది. రోజుకు ఐదుగురు ఎంపీల‌తో జ‌గ‌న్ భేటీ అవుతున్న‌ట్టు స‌మాచారం. ఈ లెక్క‌న‌.. ఐదు రోజుల పాటు జ‌గ‌న్ ఎంపీల‌తో స‌మావేశం నిర్వ‌హిస్తారు. దీంతో అస‌లు ఈ భేటీకి ఉన్న ప్రాధాదాన్యం ఏంటి ? ఎందుకు ఆయ‌న ఇప్ప‌టికి ప్పుడు.. చ‌ర్చించ‌నున్నారు? అనేది ఆస‌క్తిగా మారింది.

రాష్ట్ర వ్యాప్తంగా.. వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల మ‌ద్య చాలా కాలంగా ఆధిప‌త్య రాజ‌కీయాలు న‌డుస్తున్నాయి. ఒక‌రిద్ద‌రుబాహాటంగా రోడ్డున ప‌డ‌గా.. మ‌రికొంద‌రు అంత‌ర్గ‌త కుమ్ములాట‌ల‌తో తీరిక‌లేకుండా ఉన్నారు. గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎమ్మెల్యేల‌కు ప్ర‌చార నిధులు, ఎన్నిక‌ల ఖ‌ర్చుల నిధులు.. తామే ఇచ్చామ‌ని.. ఎంపీలు చెబుతున్నారు. అందుచేత ఎమ్మెల్యేలుతీసుకునే నిర్ణ‌యాల‌ను తాము తెలుసుకునేందుకు అవ‌కాశం ఉంద‌ని.. అస‌లు ఎమ్మెల్యే గెలిచేందుకు తామే కార‌ణ‌మ‌ని.. కూడా కొంద‌రు ఎంపీలు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అయితే.. ఈ నిధులు సాధార‌ణంగా.. ఎంపీ అభ్య‌ర్థుల నుంచి నేరుగా.. ఎమ్మెల్యే అభ్య‌ర్థుల‌కు చేర‌లేదు. పార్టీ నుంచి నేరుగా ఎమ్మెల్యేల‌కు వ‌చ్చాయి. సో.. ఎమ్మెల్యేలు ఇదే విష‌యం చెబుతూ.. త‌మ పంథాలో తాము ప‌నిచేసుకుంటున్నారు. ఇదే.. ఎంపీల‌కు, ఎమ్మెల్యేల‌కు మ‌ధ్య వివాదానికి కార‌ణంగా మారింది. మ‌రికొన్ని చోట్ల ఎంపీలు.. చాలా నిజాయితీగా ఉన్నారు. అయితే.. ఇలాంటి నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. దీనిపైనా ఎంపీలు ఆగ్ర‌హంతో ఉన్నారు. ఫ‌లితంగా ఇద్ద‌రి మ‌ధ్య వివాదాలు రేగుతున్నాయి.

గుంటూరు, అనంత‌పురం, రాజ‌మండ్రి, హిందూపురం, విశాఖ‌ప‌ట్నం.. ఇలా అన్ని నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఇదే ప‌రిస్థితి ఉంది. ఈ నేప‌థ్యంల తాజాగా రాజ‌మండ్రి ఎంపీ వ‌ర్సెస్ రాజాన‌గ‌రం ఎమ్మెల్యేలతో సీఎం భేటీ అయ్యాక‌.. ఇప్పుడు అంద‌రినీ పిల‌వ‌డం వెనుక‌.. ఇదే కార‌ణం అయి ఉంటుందని వైసీపీ వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఈ రెండున్న‌రేళ్లు ఎంపీలు, ఎమ్మెల్యేలు స‌యోధ్య‌తో ఉండాల‌ని జ‌గ‌న్ ఆదేశాలు జారీ చేయ‌డంతో పాటు ఎంపీల‌కు ప‌లు సూచ‌న‌లు చేస్తార‌ని తెలుస్తోంది.