Begin typing your search above and press return to search.

చైనా కరోనా మరణాలను దాచిపెడుతోందా, మొబైల్స్ నెట్ వర్క్స్ ఏం చెబుతున్నాయి?

By:  Tupaki Desk   |   22 March 2020 6:18 PM GMT
చైనా కరోనా మరణాలను దాచిపెడుతోందా, మొబైల్స్ నెట్ వర్క్స్ ఏం చెబుతున్నాయి?
X
చైనాలోని వూహాన్‌లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ఏ ఒక్కరూ ఇళ్లలో నుండి బయటకు రాకుండా దేశదేశాలను స్తంభింపచేసింది. ఈ వైరస్‌ను చైనా ప్రారంభంలోనే గుర్తించిందని, కానీ బయటకు పొక్కకుండా ప్రయత్నాలు చేసిందని, చైనా ఈ అనాలోచిత చర్య వల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తం గతంలో ఎన్నడూ లేని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే విమర్శలు ఉన్నాయి.

తమ దేశంలో ఈ వైరస్ సోకినట్లుగా ప్రపంచానికి తెలియకుండా జాగ్రత్త పడినందు వల్లే అక్కడి నుండి 185కు పైగా దేశాలకు వచ్చింది. నిన్న వైరస్‌ను దాచిన డ్రాగన్ కంట్రీ ఇప్పుడు మృతుల సంఖ్యను కూడా దాస్తుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కొద్ది రోజులుగా చైనాలో పాజిటివ్ కేసులు లేవని, మృతుల సంఖ్య పెరగడం లేదని చెబుతున్నారు.

చైనాలో పది రోజుల క్రితమే 3వేల మందికి పైగా మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఆ సంఖ్య 3,261గా ఉంది. అదే ఇటలీలో రెండు రోజుల్లోనే 1500 మందికి పైగా చనిపోవడంతో ఆ సంఖ్య ఆదివారానికి 5,476కు చేరుకుంది. కానీ చైనా ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ, చైనాను నిన్నటిదాకా గడగడలాడించినప్పటికీ మృతుల సంఖ్య మాత్రం పెద్దగా పెరగడం లేదు.

మరణాలను చైనా దాటివేస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ దేశ మొబైల్ నెట్ వర్క్ సర్వీస్ ప్రొవైడర్ల నివేదికను చూస్తే అది నిజమే అనిపిస్తోందట. జనవరికి ముందు కొత్త కనెక్షన్లు పెరిగితే జనవరి - మార్చి మధ్య మాత్రం ఏకంగా కోటీ యాభై లక్షల ఫోన్ నెంబర్లు పని చేయడం మానేశాయట. అంటే ఒక్కో ఫోన్లో రెండు సిమ్‌లు ఉన్నా 75 లక్షల మంది ఫోన్లు ఉపయోగించడం మానేశారన్నమాట. వీరంతా ఇప్పుడు ఎక్కడికి వెళ్లారనే ప్రశ్న ఉదయిస్తోంది.