Begin typing your search above and press return to search.
ఆ ఎంపీ మైండ్ బ్లోయింగ్ రియల్ ఫీట్
By: Tupaki Desk | 29 Sep 2015 4:17 AM GMTదేశాన్ని ఫిట్ గా ఉంచేందుకు తమ ప్రాణాలు సైతం పణంగా పెడతామని చెప్పే రాజకీయ నేతలకు దేశంలో కొదవ లేదు. అన్ని మాటలు చెప్పే వారి ఫిట్ నెస్ సంగతి చూస్తూ.. చిట్టా చాంతాడంత ఉంటుంది. బీపీ.. సుగర్ లు పక్కన పెట్టేసి.. కనీసం చలాకీగా తిరిగే నేతలు కాస్త తక్కువే. ఇలా ఉండే మన నేతల ఫిట్ నెస్ కు భిన్నంగా కర్ణాటక ఎంపీ చేసిన ఒక సాహస చర్య అందరిని ఆకట్టుకోవటమే కాదు.. ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
పెద్ద పెద్ద మాటలు చెప్పే రాజకీయ నాయకులు పొరపాటున లిఫ్ట్ లో కానీ ఇరుక్కుపోతే పడే హైరానా అంతా ఇంతా కాదు. అలాంటిది.. విమానంలో నుంచి సముద్ర మట్టానికి 13 వేల అడుగుల ఎత్తు నుంచి దూకేయటం అంత చిన్న విషయం కాదు. దానికి బోలెడంత గుండె ధైర్యం.. సాహసం చేయాలన్న పట్టుదల ఉండాలి.
ఇవన్నీ మెండుగా ఉన్న కర్ణాటక రాష్ట్ర ఎంపీ (మైసూర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు) ప్రతాపసింహ ఎవరూ ఊహించని ఫీట్ చేశారు. స్కై డ్రైవింగ్ చేయాలన్న ఆలోచనను.. మరో ఆలోచన లేకుండా పూర్తి చేసిన ఆయన.. ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బి పోతున్నారు. 38 ఏళ్ల ఈ ఎంపీ.. స్కై డ్రైవింగ్ సురక్షితంగా పూర్తి చేసిన తర్వాత హ్యాపీగా ఫీలయ్యారు. తన జీవితంలో అత్యంత సంతోషకరమైన.. మధురమైన అంశంగా స్కై డ్రైవింగ్ గురించి అభిర్ణించారు. మరి.. ఎంపీగా గెలిచిన సంగతేంటో..?