Begin typing your search above and press return to search.

మోడీపై మన్మోహన్‌ సెటైర్లు వేశారు..!

By:  Tupaki Desk   |   10 Jun 2015 6:06 AM GMT
మోడీపై మన్మోహన్‌ సెటైర్లు వేశారు..!
X
ప్రధానమంత్రిగా ఉన్నప్పటి నుంచినే మన్మోహన్‌ సింగ్‌కు మౌనంగా ఉండే వ్యక్తిగా పేరు. సోనియా అదుపాజ్ఞాల్లో పనిచేస్తాడనే కీర్తిని సంపాదించారయన. ఏ విషయంలోనూ సొంతంగా నిర్ణయాలు తీసుకోలేని వ్యక్తి.. సోనియా కీ ఇస్తే ఆడే బొమ్మ.. అనే బిరుదును కూడా పొందాడు మన్మోహన్‌ సింగ్‌. మరి గతం సంగతి అలా ఉంటే..ఇప్పుడు మాత్రం ఆయన స్పందనలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. మాజీ ప్రధాని హోదాలో మన్మోహన్‌ సింగ్‌ తన వ్యాఖ్యానాలతో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తున్నారు.

ప్రత్యేకించి తన స్థానంలో ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన మోడీపై మన్మోహన్‌ సెటైర్లు వేస్తున్నారు. ఈ పరంపరను కొనసాగిస్తూ తాజాగా మోడీని ఒక ఏల్స్‌మెన్‌గా అభివర్ణించారు మన్మోహన్‌.

తన అనంతరం భారత దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నరేంద్రమోడీ ఒక మంచి సేల్స్‌మెన్‌ అని.. ఆయన ఒక గొప్ప ఈవెంట్‌ మేనేజర్‌.. అంటూ మాజీ ప్రధానమంత్రి ప్రస్తుత ప్రధానమంత్రిపై సెటైర్లు వేశాడు.

మోడీ తనకన్నా బాగా మాట్లాడతాడని.. బాగా షో చేయగలడని కూడా మన్మోహన్‌ వ్యాఖ్యానించాడు. ఈ విధంగా మాజీ ప్రధానమంత్రి తనలో దాగున్న సెటైర్ల కళను మోడీ విషయంలో ప్రయోగించాడు. ప్రధానమంత్రి ఉత్తి హడావుడి మనిషి అని మన్మోహన్‌ సునిశితంగా విమర్శించాడు.

ఇక్కడ విశేషం ఏమిటంటే.. చేస్తున్నది రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలే అయినా.. వాటిని సోలోగా చేయలేదు మన్మోహన్‌ సింగ్‌. మేడమ్‌ సోనియాగాంధీ పక్కనే కూర్చోగా మన్మోహన్‌ ఈ వ్యాఖ్యానాలు చేశారు!