Begin typing your search above and press return to search.

అప్పుడు చిరిగిన కుర్తా చూపలేదే రాహుల్?

By:  Tupaki Desk   |   17 Jan 2017 8:06 AM GMT
అప్పుడు చిరిగిన కుర్తా చూపలేదే రాహుల్?
X
జనాలు పిచ్చి గొర్రెలు అనుకుంటారన్నట్లుగా ఉన్నాయి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు.. ఆ పార్టీ యువరాజు రాహుల్ గాంధీ మాటలు. అత్తా పత్తా లేకుండా విదేశాలకు వెళ్లిపోయి.. వారాల తరబడి బయటప్రపంచానికి సంబంధం లేకుండా వ్యవహరించే ఆయన.. ఫారిన్ ట్రిప్ ముగిసిన వెంటనే రెట్టించిన ఉత్సాహంతో జనాల మధ్యకు వస్తారు.

ఆయన చెప్పే మాటలు.. చేసే చేష్టలు చూస్తే.. ఇలాంటివి ఆయనకు మాత్రమే సాధ్యమనిపించేలా ఉంటాయి. నిన్నటికి నిన్న ఉత్తరాఖండ్ లో జరిగిన ఎన్నికలప్రచారంలో పాల్గొన్న రాహుల్.. నాటకీయతను ప్రదర్శించారు. ప్రధాని మోడీ మీదా.. పెద్ద నోట్ల రద్దు మీద తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన రాహుల్.. తీవ్ర విమర్శలు చేశారు.

ఈ మధ్యన ఖాదీబోర్డు ప్రింట్ వేసిన క్యాలెండర్ మీద గాంధీ బొమ్మకు బదులుగా మోడీ ఫోటోను వేయటాన్ని తీవ్రంగా తప్పు పట్టిన ఆయన.. సదరు క్యాలెండర్ మీద గతంలో పలుమార్లు వేర్వేరు వ్యక్తుల ఫోటోలు వేశారన్న వాస్తవాన్ని మాత్రం చెప్పలేదు. అంతేకాదు.. ఖాదీ బోర్డు ప్రచురించిన క్యాలెండర్లో ప్రధాని ఫోటో వేయటానికి.. సదరు సంస్థ పీఎంవో అనుమతి తీసుకోలేదన్న విషయాన్ని దాచి పెట్టేశారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసిన రాహుల్.. నాటకీయతను ప్రదర్శించారు. తన కుర్తా జేబును ప్రజలకు చూపించి.. తాను చినిగిపోయిన కుర్తాను వేసుకొన్నానని.. మోడీ ఇలా ఎప్పుడైనా చిరిగిపోయినకుర్తా వేసుకుంటారా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ ధనవంతులతో కలిసి ఫోటోలలో మాత్రమే కనిపిస్తారని.. ఆయన వేసుకునే కోటు లక్షల్లో ఉంటుందని మండిపడ్డారు. అంతా బాగానే ఉంది కానీ.. ఇంతలా విరుచుకుపడిన రాహుల్.. తన తల్లి రిమోట్ మాదిరి పవర్ ను ఆడించే సమయంలో రాహుల్ ఇలా చినిగిపోయిన కుర్తాల్ని వేసుకున్నారా? అన్నది ప్రశ్న. అయినా.. పవర్ లేకుంటే రెండున్నరేళ్లకే పాతబడిపోయిన.. చినిగిపోయిన కుర్తాల్లోకి వెళ్లటంఏమిటన్న సందేహానికి రాహుల్ సూటి సమాధానం చెబితే బాగుంటుందేమో?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/