Begin typing your search above and press return to search.

‘నా సోదరనిని మా ఆయనే చంపాడు’

By:  Tupaki Desk   |   18 Oct 2017 11:06 AM GMT
‘నా సోదరనిని మా ఆయనే చంపాడు’
X
హరియాణాకు చెందిన జానపది గాయని హర్షితా దహియా హత్య కేసు విషయంలో ఆమె సోదరి లత సంచలన ఆరోపణలు చేసింది. తన సోదరిని చంపింది తన భర్తే అంటూ ఆమె ఆరోపించింది. హరియాణాలో కొన్ని రోజుల నుంచి ఈ హత్య కేసు సంచలనం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లత ఒక వీడియోలను యూట్యూబ్‌ లో పోస్ట్ చేసి.. తన భర్తపై ఆరోపణలు చేసింది. తమ తల్లి హత్య కేసులో తన సోదరి సాక్షిగా ఉండటంతో ఆమెను నా భర్త కాల్చి చంపేశాడని ఆమె ఆ వీడియోలో పేర్కొంది.

హర్షిత ఇటీవల హరియాణాలోని పానిపట్‌ లో మ్యూజిక్ కన్సర్ట్ లో పాల్గొన్న అనంతరం ఢిల్లీకి వస్తుండగా ఆమెను కొందరు గుర్తుతెలియని దుండగులు కాల్చిచంపేశారు. ఆమె ఒంట్లోకి ఐదు బుల్లెట్లు దూసుకెళ్లాయి. తన బావ తనపై లైంగిక దాడి జరిపినట్లు గతంలో హర్షిత పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో హర్షిత ఇటీవల యూట్యూబ్‌ లో ఒక వీడియో పోస్టు చేసింది. తన ప్రాణాలకు కూడా ముప్పు ఉందని.. తనను చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయని ఆమె పేర్కొంది. ఆమె హత్య కేసులో ఇతర నిందితుల ప్రమేయం కూడా ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.