Begin typing your search above and press return to search.
‘సిగ్గుతో తలదించుకుంటున్నా’ అన్న మోడీ
By: Tupaki Desk | 19 Oct 2016 5:15 AM GMTమోడీ లాంటి మహానేత నోటి నుంచి ఇలాంటి మాటా? తాను ప్రధానిగా అధికారం చేపట్టిన తర్వాత దేశం మొత్తాన్ని ఇట్టే మార్చేస్తానని చెప్పిన పెద్దమనిషి.. తీరా రెండున్నరేళ్ల పాటు (సుమారు) ప్రధానమంత్రిగా ఉన్న తర్వాత.. ఒక అంశంపై తాను సిగ్గుతో తలదించుకుంటున్నానన్న మాట చెప్పటం కాసింత ఆశ్చర్యం..ఆసక్తికరమైన విషయంగానే చెప్పాలి. ఇవాల్టి రోజున చిన్నపిల్లాడు సైతం తానుచేసిన తప్పును ఒప్పుకునే పరిస్థితి లేదు. అలాంటి కాలంలో.. జరుగుతున్న పరిణామాలపైనా.. తాను నాయకత్వం వహిస్తున్న దేశంలో చోటుచేసుకుంటున్న ఒక అంశంపై మోడీలాంటి మహానేత సిగ్గుతో తల దించుకుంటున్నానన్న పెద్ద మాట రావటం ఆసక్తికరమైన అంశంగా చెప్పక తప్పదు.
మోడీ నోటి నుంచి వచ్చే ప్రతి మాటలోనూ ‘వ్యూహం’ మిస్ కాకుండా ఉండటం కనిపిస్తుంది. అలాంటి నేత.. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల తర్వాత కూడా దళితులపై అకృత్యాలు సాగుతుండటంపై తాను సిగ్గుతో తలదించుకుంటున్నట్లు చెప్పి అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తారు. మోడీ లాంటి నేతకు ఉన్నట్లుండి దళితులు గుర్తుకు రావటం ఏమిటి చెప్మా అన్న సందేహం రావొచ్చు.అందుకు కారణం లేకపోలేదు. తాజాగా ఆయన లూధియానాలో ఎస్సీ.. ఎస్టీ హబ్ ను ప్రారంభించారు. దళితులను ఉద్దేశించి.. తన మనసులోని మాటను చెప్పటం ద్వారా.. దళితుల మనసు దోచుకునే సువర్ణావకాశాన్ని ఆయన మిస్ చేసుకోలేదనే చెప్పి. దళితులకు బ్రాండ్ అంబాసిడర్లుగా చెప్పుకునే పార్టీలకు కౌంటర్ గా.. తాము సైతం దళితుల గురించి ఎంత వేదన చెందుతున్నానన్న విషయాన్ని మోడీ తన మాటలతో చెప్పకనే చెప్పేశారు.
దళితుల్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్న వైనం గురించి తనకు తెలిసినప్పుడు తానెంతో వేదన చెందుతానని.. అలాంటి విషయాలు విన్నప్పుడు సిగ్గుతో తలదించుకుంటానని చెప్పిన ఆయన.. ఇక ఏ మాత్రం వెయిట్ చేయకూడదని చెప్పేశారు. ఎస్సీ.. ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఎదిగేందుకు తాను ప్రారంభించిన హబ్ సాయం చేస్తుందని.. దళితులు పారిశ్రమికవేత్తలుగా మారటమే కాదు.. ఇతరులకు ఉద్యోగాలు కూడా ఇవ్వగలరన్న విషయాన్ని మోడీ చెప్పారు. స్టార్టప్ ఇండియా.. స్టాండప్ ఇండియా పథకాల్లో భాగంగా కోటి రూపాయిల వరకూ ఎస్సీ.. ఎస్టీలకు రుణాలు ఇవ్వాలని తాము 1.25 లక్షల బ్యాంకు శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లుగా వెల్లడించారు. తాము చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా 3.75 లక్షల మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారు అవుతారని చెప్పుకొచ్చారు.
త్వరలో జరిగే యూపీ ఎన్నికల్లో దళిత ఓటు బ్యాంకుతో పాటు.. ఇప్పటికీ దళితుల మనసులు కొన్ని పార్టీలకే పరిమితం అన్న భావనను పటాపంచలు చేయటంతోపాటు.. దళితుల గురించి తాము కూడా ఆలోచిస్తున్నామన్న విషయాన్ని మోడీ తన తాజా మాటలతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. దళితులపై జరుగుతున్న దాడులకు తాను సిగ్గుపడుతున్నట్లుగా మోడీ చెప్పిన మాటలకు ఆయా వర్గాలు ఎలా రియాక్ట్ అవుతాయో చూడాలి. కొసమెరుపు ఏమిటంటే.. దళితులపై జరుగుతన్న దాడుల్ని ఖండించి.. అలాంటి ఉదంతాలకు తాను సిగ్గుతో తలదించుకుంటున్న విషయం.. ప్రధానిగా తాను పదవిని చేపట్టిన రెండున్నరేళ్ల తర్వాత చెప్పటం ఏమిటి చెప్మా..?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/