Begin typing your search above and press return to search.
ఆ పని చేయించినందుకు నాన్న కొట్టి హెచ్‌ఐవి టెస్ట్ చేయించాడు
By: Tupaki Desk | 27 March 2023 4:00 PM GMTటీం ఇండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి. తెలియక చేసిన పని వల్ల నాన్న చేతిలో దెబ్బలు తినడంతో పాటు హెచ్ ఐ వి టెస్ట్ కూడా చేయించుకోవాల్సి వచ్చిందని ఆ ఇంటర్వ్యూలో ధావన్ పేర్కొన్నాడు.
ఐపీఎల్ లో పంజాబ్ జట్టు కెప్టెన్ గా ధావన్ నియమించబడ్డాడు. త్వరలో ఐపీఎల్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ధావన్ పంజాబ్ జట్టు కెప్టెన్ గా మీడియా ముందుకు వచ్చాడు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ధావన్ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు.
15 సంవత్సరాల వయసులో మొదటి టాటూను వేయించుకున్నాను. ఆ సమయంలో నాన్న కొట్టి హెచ్ఐవి పరీక్ష చేయించారు. అప్పట్లో టాటూ వేయించుకుంటే హెచ్ఐవి వస్తుందని భయం ఉండేది. అందుకే నాన్న టాటూలు వేయించుకుంటే ఒప్పుకునేవారు కాదు.
నా భుజంపై వేయించుకున్న టాటూ కుటుంబ సభ్యుల కు తెలియకుండా ఉండాలనుకున్నాను.. మూడు నెలల వరకు దాచి ఉంచాను. ఒకరోజు నాన్న ఆ పచ్చబొట్టు చూసి చాలా కొట్టాడు. నేను ఆ పచ్చబొట్టు వేయించుకున్న తర్వాత కొంచెం భయపడ్డాను.
టాటూ వేసే వ్యక్తి ఎటువంటి సూదులను ఉపయోగిస్తాడో తెలియదు కదా అని నాన్న న్ను తీసుకు వెళ్లి హెచ్ఐవి టెస్ట్ చేయించారు. అయితే నెగిటివ్ గానే తేలింది. దాంతో ఊపిరి పీల్చుకున్నాను అని ధావన్ పేర్కొన్నాడు. అయితే ఈ మధ్యకాలంలో ధావన్ చాలానే టాటూలు వేయించుకున్నాడు. ఇప్పుడు ఆ భయం లేదని సరదాగా నవ్వేశాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.