Begin typing your search above and press return to search.

ప్రభుత్వం హ్యాక్ చేస్తోంది: ప్రియాంక సంచలన వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   22 Dec 2021 4:25 PM GMT
ప్రభుత్వం హ్యాక్ చేస్తోంది: ప్రియాంక సంచలన వ్యాఖ్యలు
X
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా తన పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేశారని సంచలన ఆరోపణలు చేసింది. ప్రియాంక ఆరోపణల నేపథ్యంలో అడ్వాన్స్‌డ్ యాంటీ సైబర్ క్రైమ్ యూనిట్ - ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ద్వారా అభియోగాలను విచారించాలని కేంద్రం నిర్ణయించినట్లు సమాచారం.

కొద్ది రోజుల క్రితం సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం తన ఫోన్‌తోపాటు తన పార్టీ సభ్యుల ఫోన్‌లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తమ పార్టీ వ్యక్తుల ఫోన్ సంభాషణలను స్నూప్ చేశారని యాదవ్ ఆరోపించారు. ఎస్పీ జాతీయ కార్యదర్శి రాజీవ్‌ రాయ్‌తో పాటు ఎస్పీ చీఫ్‌కు సన్నిహితులైన మరో ముగ్గురు పార్టీ నేతల ఇళ్లపై ఐటీ దాడులు జరిగిన ఒక రోజు తర్వాత అఖిలేష్ ఆరోపణలు చేయడం సంచలనమైంది.

ఎలక్ట్రానిక్స్-ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోకి వచ్చే సెర్ట్ ఇన్.. హ్యాకర్లను గుర్తించగల.. సైబర్‌ టాక్‌లను నిరోధించగల అధునాతన ల్యాబ్‌ను ప్రభుత్వం కలిగి ఉంది. ప్రియాంక గాంధీ ఇంకా అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే, కేంద్ర ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు.. వారు ప్రజలకు సేవ చేయకుండా ప్రతిపక్ష నాయకుల ఫోన్ సంభాషణలను ఎందుకు ట్యాప్ చేస్తున్నారని ప్రశ్నించారు.

ఇజ్రాయెల్ సంస్థ తయారు చేసిన పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి ఫోన్ స్నూపింగ్ ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని ప్రియాంక గాంధీ.. ఇతర ప్రతిపక్ష నాయకులు డిమాండ్ చేశారు. నవంబర్ 2019 నుంచి కాంగ్రెస్ ఫోన్ స్నూపింగ్ ఆరోపణలు గుప్పిస్తోంది. ప్రియాంకతో సహా తమ ముగ్గురు నేతల ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని ఆ పార్టీ పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఇలాంటి ఆరోపణలు చేశారు.

పెగాసస్ స్పైవేర్ కేసు సబ్-జ్యూడిషిరీ, రిటైర్డ్ జడ్జి నేతృత్వంలోని ప్యానెల్ ద్వారా విచారిస్తున్నారు. ఇజ్రాయెల్‌కు చెందిన ఓ సంస్థ తయారు చేసిన స్పైవేర్‌ను జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కార్యకర్తలపై కన్నేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

గత కొన్ని ఎన్నికలలో ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ పేలవమైన ప్రదర్శన ఇవ్వడంతో ఇప్పుడు కాంగ్రెస్ గెలుపు బాధ్యతను ప్రియాంక గాంధీకి అప్పగించారు.