Begin typing your search above and press return to search.
కొత్త పాలక మండలికి చుక్కెదురు..ఇంద్రకీలాద్రిపై గది గొడవ..
By: Tupaki Desk | 3 March 2020 1:43 PM GMTవిజయవాడలో ఇంద్రకీలాద్రిపై దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఉంది. భక్తుల కల్పవల్లిగా.. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా దుర్గమ్మ వెలుగొందుతున్నారు. ప్రస్తుతం ఆ ఆలయం సుందరంగా ముస్తాబైంది. భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తూ ఆలయ పాలకమండలి చర్యలు తీసుకుంది. ఇప్పుడు ఈ ఆలయం అద్భుతంగా రూపుదిద్దుకుని భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. రాష్ట్రంలో అధికారం మారడంతో ప్రస్తుతం ఈ ఆలయానికి పాత పాలకమండలి పోయి కొత్త వారు వచ్చారు. చైర్మన్ పైలా సోమినాయుడు ఆధ్వర్యంలో 16 మందితో కొత్త పాలకమండలి ఏర్పడింది. ప్రస్తుతం వారు బాధ్యతలు తీసుకున్నారు.
అయితే వీరు బాధ్యతలు తీసుకున్న తొలిరోజే వివాదం రేగింది. పాలకమండలికి ఆలయ ఆవరణలోని మహామండపం ఏడో అంతస్తులో రాజగోపురానికి కుడివైపు చివరన శిథిలావస్థలో ఉన్న చిన్నగదిని కేటాయించారు. దీంతో కొత్త పాలకమండలి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత చిన్న గది తమకు ఎలా సరిపోతుందని ప్రశ్నించారు. అయితే ఈ గదిపై ఉన్న పుకార్లతో కూడా కొత్త మండలి ఆ గదిలో చేరేందుకు నిరాకరించారంట. ఆ గదిలో వాస్తుదోషంతో పాటు శిథిలావస్థకు చేరి ఉండడంతో అధికారుల తీరుపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
గతంలో ఈ గదిలో అమ్మవారి దర్శనానికి వచ్చే ప్రముఖులు కాసేపు వేచి ఉండేందుకు వీఐపీ లాంజ్ గా ఉపయోగించేవారు. తాత్కాలికంగా ఉండేందుకు కాబట్టి ఈ గదిని అట్టముక్కలు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో నిర్మించారు. కొన్నాళ్లకు ప్రొటోకాల్ కార్యాలయంగా వాడారు. అయితే ఆలయ ఈఓగా ఉన్న సమయంలో పద్మ తన కార్యాలయాన్ని ఈ గదికి మార్చుకున్నారు. ఆమె బదిలీ పై వెళ్లాక ఈఓగా వచ్చిన వి.కోటేశ్వరమ్మ కూడా ఈ గదిలోనే కార్యాలయం కొనసాగించారు. ఆమె బదిలీ కావడానికి కొన్ని రోజుల ముందు సీలింగ్ పెచ్చులూడి ఈఓ కోటేశ్వరమ్మ తలపై పడి స్వల్పంగా గాయ పడ్డారు. ఆ తర్వాత ఆమె బదిలీ అవడంతో ఈఓగా ఎంవీ సురేశ్ బాబు వచ్చారు.
అయితే కార్యాలయాన్ని వినియోగించడం లో వెనకంజ వేశారు. ఈ గది ఎవరికీ కలిసి రాలేదని, అందుకే ఈఓలు తరచు బదిలీ అవుతున్నారని ప్రచారం సాగింది. దీన్ని నమ్మిన సురేశ్ బాబు ఆ గదిలో విధులు నిర్వహించడానికి ఇష్టపడలేదు. వాస్తు దోషం ఉన్న గది వలనే ఈఓలుగా ఉన్న పద్మ, కోటేశ్వరమ్మకు ఏడాదిలోపే బదిలీ అయ్యారని పుకార్లు వచ్చాయి. దీంతో కొండపై చిన్నరాజగోపురం వద్ద మెట్ల పక్కన ఉన్న కార్యాలయాన్ని సురేశ్ బాబు ఈఓ కార్యాలయంగా మార్చుకున్నారు.
అయితే ఆయన మార్చుకున్న కార్యాలయాన్ని గతంలో దేవస్థానం పాలక మండలి కార్యాలయం గా ఉండేది. దీంతో ఆ కార్యాలయాన్ని ఈఓ సురేశ్ బాబు తీసుకుని ఏడో అంతస్తులోని గదిని కొత్త పాలకవర్గ మండలికి కేటాయించారు. ఆ చిన్న గదిలో మొత్తం 16 మంది పాలకమండలి సభ్యులు ఎలా కూర్చుంటారని, ఆ గది కాకుండా వేరేది ఇవ్వాలని కొత్త పాలకవర్గం పట్టుబట్టింది. దీనికి తోడు వాస్తు దోషం ప్రచారం కూడా ఉండడంతో పాలక మండలి సభ్యులు ఆ గదిలోకి వెళ్లేందుకు సుముఖం వ్యక్తం చేయలేదు. ఆ గదిని ఎలా కేటాయిస్తారని ఈఓ సురేశ్ బాబును ప్రశ్నించారని తెలుస్తోంది. త్వరలోనే ఆ గది కాకుండా మరో గదికి పాలకమండలి కార్యాలయం మార్చే అవకాశం ఉంది.