Begin typing your search above and press return to search.
ఆ 35 మంది అమ్మాయిలు బతికే ఉన్నారు
By: Tupaki Desk | 9 Jan 2020 1:30 AM GMTదేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ముజఫర్పూర్ షెల్టర్ హోమ్ కేసు తాజాగా భారీ మలుపు తిరిగింది. ఈ షెల్టర్ హోమ్‌లో 35 మంది బాలికలను చంపేశారని తొలుత భావించినా అది నిజం కాదని సీబీఐ తాజాగా సుప్రీంకోర్టుకు వెల్లడించింది. షెల్టర్ హోమ్‌లో దొరికిన అస్థిపంజరాలు హోమ్‌లోని మైనర్ బాలికలవి కావని తెలిపింది. ముజఫర్పూర్ షెల్టర్ హోమ్ వేధింపుల కేసు సహా బీహార్‌లోని మొత్తం 17 షెల్టర్ హోమ్ కేసుల్లోనూ దర్యాప్తు పూర్తయ్యిందని ధర్మాసనానికి సీబీఐ విన్నవించింది.
సీబీఐ తరపున విచారణకు హాజరైన అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్... ‘‘ముజఫర్పూర్ షెల్టర్ హోమ్ లో బాలికలెవరూ హత్యకు గురికాలేదు. అక్కడ లభించిన అస్థికలు మైనర్ బాలికలవి కాదు’’ అని కోర్టుకు తెలిపారు. దీంతో చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సీబీఐ నివేదికను స్వీకరించి, దర్యాప్తు బృందంలోని ఇద్దరు అధికారులను రిలీవ్ చేసింది. మొత్తం రెండు అస్థికలు లభ్యమయ్యాయనీ... కానీ అవి ఒక పురుషుడు, మరో మహిళకు సంబంధించినవని ఫోరెన్సిక్ నివేదికలో తేలిందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది.
2018 ఏప్రిల్‌లో బీహార్ సాంఘిక సంక్షేమ శాఖకు టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ స్టడీస్ (టీఐఎస్ ఎస్) సమర్పించిన నివేదికతో ముజఫర్పూర్ షెల్టర్ హోమ్ దారుణాలు తొలిసారి వెలుగులోకి వచ్చాయి. ఓ ఎన్జీవో నిర్వహిస్తున్న ఈ హోమ్‌లో అనేక మంది మైనర్ బాలికలపై లైంగిక, శారీరక వేధింపులు జరిగాయంటూ ఆరోపణలు వచ్చాయి. ఓ బాలికను చంపి పాతిపెట్టినట్టు ఆరోపణలు రావడం... షెల్టర్ హోం ఆవరణలో అధికారులు ఓ అస్థి పంజరం తవ్వి తీయడం మరింత కలకలం రేపింది. దీంతో ప్రధాన నిందితుడు బ్రజేష్ ఠాగూర్ సహా మొత్తం 11 మందిపై 2018 మేలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీహార్‌లోని మరో 16 వసతి గృహాల్లో కూడా ఇదే రీతిన బాలికలపై వేధింపులు జరిగినట్టు టీఐఎస్ఎస్ తన నివేదికలో పేర్కొనడంతో... సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించింది.
బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ హోంను నిర్వహిస్తున్న బ్రజేష్ ఠాకూర్ రాజకీయంగా పలుకుబడి ఉన్న వ్యక్తి. ఇక అతను, అతని అనుచరులు సుమారు 11 మంది యువతులను చంపేసి ఉండవచ్చునని తొలుత సీబీఐ అనుమానించింది. అంతేకాదు అక్కడి పరిసరాల్లో గుట్టలుగా ఎముకలను స్వాధీనం చేసుకున్నట్లు గత ఏడాదే కోర్టుకు కూడా చెప్పింది. అయితే.. చనిపోయారని భావించిన అమ్మాయిలు తర్వాత సజీవంగానే ఉన్నట్లు గుర్తించామని ఇప్పుడు చెబుతోంది.