Begin typing your search above and press return to search.

అక్కడలా చేస్తే.. బేడీలేసి రోడ్డు మీద నిలబెట్టారు

By:  Tupaki Desk   |   10 Sept 2015 7:54 PM IST
అక్కడలా చేస్తే.. బేడీలేసి రోడ్డు మీద నిలబెట్టారు
X
ఈవ్ టీజింగ్ ను అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన షీ టీమ్స్ విజయవంతంగా నడుస్తున్న సంగతి తెలిసిందే. సామాన్యుల మాదిరి కలిసిపోయి.. ఆకతాయిల భరతం పట్టే షీ టీమ్స్ వైఖరిపై ఇప్పటికే ప్రశంసలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పద్ధతి అనుసరిస్తే.. ఉత్తరప్రదేశ్ లోని ఒక ప్రాంతంలో ఆకతాయిలకు చెక్ చెప్పేందుకు అనుసరిస్తున్న వైఖరి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ పోలీసులు ఆకతాయిలకు సరికొత్త శిక్షను అమలు చేస్తున్నారు. అమ్మాయిల్ని ఏడిపిస్తూ దొరికిపోయిన ఆకతాయిల్ని పట్టుకొని చేతులకు బేడీలేసేసి.. నగర కూడళ్లలో నిలబెట్టేస్తున్నారు. ఈ చర్యతో సిగ్గుతో చితికిపోతున్న ఆకతాయిలకు ఇంతకు మించిన గుణంపాఠం మరొకటి ఉండదని చెబుతున్నారు.

అమ్మాయిలు ఎక్కువగా తిరిగే ప్రాంతాల్లో మఫ్టీల్లో ఉండే పోలీసులు.. ఏ మాత్రం ఈవ్ టీజింగ్ కు పాల్పడినా చేతులకు బేడీలేసేస్తున్నారట. దీంతో ముజఫర్ నగర్ లో ఇప్పుడు అల్లరి చిల్లరి అబ్బాయిలకు వణుకు పుడుతోందట. ముజఫర్ నగర్ పోలీసుల ఐడియా కూడా బాగానే ఉంది కదూ.