Begin typing your search above and press return to search.

మునక్కాయ మటన్ తింటే శృంగారంలో ఫుల్ కిక్

By:  Tupaki Desk   |   19 May 2020 5:30 PM GMT
మునక్కాయ మటన్ తింటే శృంగారంలో ఫుల్ కిక్
X
ప్రకృతి మనకూ అన్నీ ఇచ్చింది.. ప్రతి వృక్షంలోనూ ఏదో ఒక మూలిక ఉండి అది మనకు ఉపయోగపడుతుంది. మానవుడికి చాలా ఆరోగ్య ప్రయోజనాలు అందించే మొక్కల్లో మునగ ప్రత్యేకమైనది..

మునగ ఆకు, మునగ విత్తనాలు, మునక్కాయలు.. ఇలా అన్నింటినీ వంటల్లో వినియోగిస్తారు. మునగ విత్తనాలతో డయాబెటీస్, అనీమియా, హార్ట్ డిసీజ్, లివర్ డిసీజ్, అర్థరైటిస్, జీర్ణ సమస్యలు, అనేక చర్మ రోగాల నుంచి ఉపశమనం పొందవచ్చు.

అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూరోసైన్స్ స్టడీ నివేదిక ప్రకారం.. మునక్కాయ లో అప్రోడైసియాక్ అనే పదార్థం ఉంటుందని.. దాని వల్ల పురుషుల్లో సెక్స్ హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ లెవల్స్ బాగా పెరుగుతాయని తేల్చారు.

ఇక మునగకాయలతో మటన్ కలిపి కూర వండితే ఆ టేస్టే వేరుగా ఉంటుందని.. ఈ రెండింటితో కామోద్దీపనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మటన్ లోని ప్రొటీన్స్, మునక్కాయలోని అప్రోడైసియాన్ కలిస్తే నవదంపతులకు ఫుల్లు కిక్కు వస్తుందని.. శృంగారంలో అదరగొడుతారని పెద్దలు చెబుతున్నారు.

ములగ చెట్టు ఎండిన బెరడును ఆవు పాలతో మరిగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెల రోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని స్తంభన కలుగుతుంది. ములగపూలు , పాలలో వేసుకొని తాగాలి. దీనివలన ఆడవారికి, మగవారికి శృంగార సామర్థ్యం పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.