Begin typing your search above and press return to search.

వైసీపీ లో ముస్తాఫా బాధేంటో వినండి సామీ.. !

By:  Tupaki Desk   |   27 Jun 2023 7:00 AM GMT
వైసీపీ లో ముస్తాఫా బాధేంటో వినండి సామీ.. !
X
ముస్తాఫా.. ఇప్పుడు గుంటూరు లో వినిపిస్తున్న ప్ర‌ముఖ పేరు. ఏ ఇద్ద‌రు వైసీపీ నాయ‌కులు క‌లిసినా.. ము స్తాఫా గురించే చ‌ర్చించుకుంటున్నారు. "ముస్తాఫా బాధేంట‌న్నా! ఏం జ‌రుగుతోంది. ఆయ‌నేమ‌నుకుంటున్నారు?" అనే చ‌ర్చే సాగుతోంది. గుంటూరు తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి 2014,19 ఎన్నిక‌ల్లో విజయం అందుకున్న ముస్తాఫా.. మంత్రి ప‌ద‌వి ని ఆశించారు. అయితే.. క‌డ‌ప ఎమ్మెల్యే అంజాద్ బాషాకే.. జ‌గ‌న్ మొగ్గు చూపారు.

దీంతో త‌న దాకా వ‌చ్చిన మంత్రి ప‌ద‌వి జారిపోయింద‌ని.. ముస్త‌ఫా తీవ్ర ఆవేద‌న‌ లో ఉన్నారు. దీనికి తోడు.. మ‌రో సారి మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ జరిగినా.ఆ య‌న‌ కు జ‌గ‌న్ ప్రాధాన్యం ఇవ్వ‌లేదు. నిజాని కి గ‌తం లో టీడీపీ నుంచి ఆఫ‌ర్ వచ్చినా ముస్తాఫా వెన‌క్కి త‌గ్గి.. త‌న పార్టీ వైసీపీ లోనే ఉండిపోయారు. అలాంటి వీర విశ్వాస పాత్రుడైన త‌న‌ను సీఎం జ‌గ‌న్ ప‌ట్టించుకోవ‌డం లేద‌నేది ముస్తాఫా ఆవేద‌న‌.

ఈ క్ర‌మంలోనే ఆయ‌న ఇటీవ‌ల కాలం లో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేస్తున్నారు. త‌న నిర్ణ‌యాలు కూడా ఎలాంటి మొహ‌మాటం లేకుండా ప్ర‌క‌టిస్తున్నారు. అధిష్టానం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకుండానే.. ఆయ‌న త‌న కుమార్తెను తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకున్నారు. గ‌డ‌ప గ‌డ‌ప‌ కు కార్య‌క్ర‌మంలో ఆమెతోనే తిరుగుతున్నారు. ఇక‌, ఇప్పుడు తాజాగా.. ఆయ‌న అధికారుల‌ పై నిప్పులు చెరిగారు. ప‌నులు చేయ‌డం లేద‌ని.. వ్యాఖ్యానించారు.

అధికారుల‌ కు దండం పెడుతున్నా.. నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నులు చేయండి! అని ముస్తాఫా బ‌హిరంగ వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. ఇలా చేయ‌డం వ‌ల్ల రాజ‌కీయంగా ఆయ‌న‌ కు జ‌రిగే ప్ర‌యోజ‌నం ఏమో కానీ.. పార్టీకి డ్యామేజీ జ‌రుగుతుంద‌ని సీనియ‌ర్లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలోనే సీఎం జ‌గ‌న్ జోక్యం చేసుకుని.. ముస్తాఫా బాధేం టో వినండి సామీ.. అని అధిష్టానానికి సూచిస్తున్నారు. ఏదేమైనా.. ఒక‌ప్పుడు ఫీల్‌గుడ్‌ గా ఉన్న ముస్తాఫా పై అధిష్టానం ద‌గ్గ‌ర మార్కులు త‌గ్గుతున్నాయ‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు.