Begin typing your search above and press return to search.

ఎవరు నిజమైన ముస్లిములు!?

By:  Tupaki Desk   |   12 April 2015 7:00 PM IST
ఎవరు నిజమైన ముస్లిములు!?
X
తెలంగాణలో ఇటీవల జరిగిన రెండు ఎన్‌కౌంటర్లు.. వాటిలో మరణించిన వ్యక్తులు.. ఆ తర్వాత పరిణామాలు తీవ్రస్థాయిలో చర్చనీయాంశం అవుతున్నాయి. నిజమైన ముస్లిములు ఎవరు!? ముస్లిములు ఎవరికి మద్దతు ఇస్తారు!? వంటి చర్చలు కూడా విస్తృతంగానే సాగుతున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.

వికారుద్దీన్‌ ముఠా ఉగ్రవాదుల ముఠా. ఈ ముఠా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడింది. పలువురు పోలీసులను మట్టుబెట్టింది. అవకాశం వస్తే మరెంతో మందిని మట్టుబెట్టేది. ఉగ్రవాద దాడుల సందర్భంగా ముస్లిములు అడ్డువచ్చినా చంపకుండా ఉండి ఉండేది కాదు.

జానకీపురంలో జరిగిన ఎన్‌కౌంటర్లో తీవ్రంగా గాయపడి సాటి ముస్లిముల చేతిలోనే చనిపోయిన ఎస్సై సిద్ధయ్య. ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దేశం కోసం, భద్రత కోసం ఆయన తన ప్రాణాలనే పణంగా పెట్టాడు. విధి నిర్వహణలో, దేశ రక్షణ కోసం ముస్లిములను చంపాల్సి వచ్చినా ఆయన క్షణకాలం కూడా ఆలోచించేవాడు కాదు.

వీరిలో, వికారుద్దీన్‌ ముఠా దేశ భద్రతకు పెను ప్రమాదం అయితే.. సిద్దయ్య దేశ భద్రతకు రక్షణ కవచం. కానీ, ఇద్దరికీ జరిగిన అంత్యక్రియలను ఇప్పుడు ప్రతి ఒక్కరూ తరచి తరచి చూస్తున్నారు. సిద్దయ్య ముస్లిం అయినా, ఆయన వీర మరణం పొందినా ఆయన అంత్యక్రియలకు ఒక్క ముస్లిం కూడా రాలేదని, ఒక్క ముస్లిం నాయకుడు కూడా సంతాపం చెప్పలేదని ఇప్పుడు పలువురు తెరపైకి తీసుకొస్తున్నారు. ఆయన అంత్యక్రియలకు ఒక్క ముస్లిం ఎమ్మెల్యే కూడా వెళ్లలేదని చెబుతున్నారు. అదే సమయంలో వికారుద్దీన్‌ ముఠా అంత్యక్రియలకు మజ్లిస్‌ ఎమ్మెల్యే వెళ్లాడు. ముస్లిములంతా వారి వెంటే ఉన్నారు. ముస్లిం నాయకులంతా వారి అంత్యక్రియలకు వెళ్లారు.

తెలంగాణ సమాజమైనా.. మరే ఇతర సమాజమైన వికారుద్దీన్‌ గ్యాంగ్‌ను ఉగ్రవాదులుగా చూస్తుంటే సిద్దయ్యను హీరోగా పరిగణిస్తోంది. ముస్లిములు మాత్రం వికారుద్దీన్‌ గ్యాంగ్‌ను హీరోగా సిద్దయ్యను విలన్‌గా పరిగణిస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు.