Begin typing your search above and press return to search.
సాధువుల హత్యకేసు నిందితుల్లో ముస్లింలు లేరు!
By: Tupaki Desk | 22 April 2020 9:50 AMఇద్దరు సాధువులతోపాటు.. ఓ డ్రైవర్ ను ముంబై - పాలఘర్ సమీపంలో గ్రామస్ధులు మూకదాడి చేసి హతమార్చారు. ఈ ఘటనపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం రేగిన విషయం తెలిసిందే. ఈ హత్య కేసులో నింధుతులైన మొత్తం 110 మందిని అరెస్టచేయగా.. అందులో తొమ్మిది మంది మైనర్లు ఉండగా వారిని జువైనల్ కు తరలించారు. తాజాగా ఆ 101 మంది నిందుతుల జాబితాను ఉద్ధవ్ సర్కారు విడుదల చేసింది. అలాగే , 101 మంది నిందితుల్లో ఒక్క ముస్లిం కూడా లేరని మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు.
సాధువుల హత్య కేసులో కుట్ర దాగి ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ జాబితా విడుదల చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే , దొంగలనే పుకార్లు రావడం వల్లే దుండగులు దాడి చేసి ,వాహనం లో ఉన్న ఇద్దరు సాధువులను, డ్రైవర్ ను కొట్టి చంపారు అని పోలీసులు చెప్తున్నారు. మరణించిన సాధువులను కల్పవృక్ష గిరి మహరాజ్ - సుశీల్ గిరి మహరాజ్ గా గుర్తించారు. తమ సమక్షంలోనే దాడి జరుగుతున్నా పోలీసులు అడ్డుకోలేకపోయారు. ఇప్పటికే ప్రభుత్వం ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసింది. ఈ ఘటన పై ప్రభుత్వం సీఐడీ విచారణ కు ఆదేశించిన సంగతి తెలిసిందే.