Begin typing your search above and press return to search.
తలాఖ్ పై ఫైర్...హిందూ మతంలోకి ముస్లిం!
By: Tupaki Desk | 19 April 2017 5:27 PM ISTట‌్రిపుల్ తలాఖ్ పై ముస్లిం మహిళల్లో వ్యతిరేకత రోజురోజుకూ పెరిగిపోతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సామాజిక దురాచారంపై వాళ్లు పబ్లిక్ గానే విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఉత్తరాఖండ్ కు చెందిన ఓ ముస్లిం మహిళ మరో అడుగు ముందుకేసింది. ట్రిపుల్ తలాఖ్ ను అంతమొందించడానికి ప్రయత్నిస్తున్న ప్రధాని నరేంద్ర మోడీ - యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ లపై ప్రశంసలు కురిపించింది. అంతేకాదు ఇస్లాంలో జరుగుతున్న ఈ అన్యాయాన్ని భరించేకంటే హిందు మతంలోకి మారడమే ఉత్తమమని ఆ మహిళ స్పష్టం చేసింది.
ట్రిపుల్ తలాఖ్ పై తనకున్న వ్యతిరేకతను, ఆగ్రహాన్ని బహిరంగంగా ఓ టీవీ ప్రోగ్రామ్ లోనే చెప్పింది ఆ మహిళ. హిందూ మతంలోకి మారితే ఒక్క తలాఖ్ అన్న పదంతో విడాకులు ఇచ్చే అవకాశం ఉండదు అని ఆమె అభిప్రాయపడింది. ఆమె సోదరి ఈ ట్రిపుల్ తలాఖ్ బాధితురాలే కావడం గమనార్హం. అందుకే ఈ దురాచారంపై పబ్లిగ్గానే ఘాటైన విమర్శలు చేసిందామె. కాగా, ప్రధాని నరేంద్రమోడీ త్రిపుల్ తలాఖ్ ను ‘చెడు సామాజిక ఆచరణ’గా అభివర్ణించిన సంగతి తెలిసిందే. ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ త్రిపుల్ తలాఖ్ పై మాట్లాడుతూ ద్రౌపది వృత్తాంతాన్ని ప్రస్తావించారు. ద్రౌపది నిండు సభలో ఈ పరిస్థితికి కారణమెవరు, నేరస్థులు ఎవరు అని ప్రశ్నిస్తూ విదురుడు సమాధానమిస్తూ దీనికి కారణమైన వారు నేరస్థులు, దీనిని సమర్థించినవారు అపరాధులు, దీనిని చూస్తూ మౌనంగా ఉన్నవారు బాధ్యులని చెప్పిన విషయాన్ని యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. తాజాగా ఈ వ్యాఖ్యలను ముస్లిం మహిళ ప్రస్తావించడం గమనార్హం
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/