Begin typing your search above and press return to search.
భారత్ కి ముస్లిం ప్రధాని... ?
By: Tupaki Desk | 13 Feb 2022 11:30 AM GMTఅఖండ భారత్ విడిపోయిన తరువాత ముస్లిం నేత ఎపుడూ ప్రధాని కాలేదు, రాష్ట్రపతి వంటి ఉన్నత పదవులు వారు నిర్వహించారు కానీ, దేశాన్ని ఏలే అత్యంత కీలకమైన ఈ పదవి మాత్రం దక్కలేదు. మరి ఆ అసంతృప్తి నుంచి వచ్చిన మాటా లేక భవిష్యత్తులో అలా జరగాలని కోరికా ఏమో తెలియదు కానీ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మాత్రం ఈ దేశానికి ముస్లిం ప్రధాని రావాలంటున్నారు. అది కూడా ఒక మహిళ కావాలని అంటున్నారు. తాను బతికి ఉండగా చూడకపోవచ్చు కానీ ఏదో నాడు అది జరిగి తీరుతుంది అని జోస్యం కూడా చెబుతున్నారు.
నిజానికి చూస్తే భారత దేశం అంటేనే భిన్నత్వంలో ఏకత్వం. ఎన్నో మతాలున్నాయి. హిందూమతంలో ఎన్నో కులాలు ఉన్నాయి. ఎన్నో రాష్ట్రాలు, ప్రాంతానికో కల్చర్ ఉంది. ఇక లోకల్ గా చూస్తే భాష, యాస అనేకం. అలా ఎవరి గోస వారిది, ఎవరి ధ్యాస వారిది. అందరికీ కలిపి ఉంచేది, ఒక పుల దండగా దారంగా ఉంచేది మాత్రం రాజ్యాంగం. భారత రాజ్యాంగం అంత గొప్పది.
ఇదిలా ఉంటే ఈ దేశంలో మళ్లీ విభజన నాటి భావాలు మొగ్గతొడుగుతున్నాయా అన్న అనుమానాలు అయితే అందరిలో ఉన్నాయి. ఈ దేశంలో మెజారిటీ హిందువులే. కానీ హిందువులు పూర్తిగా లౌకిక భావాలు కలిగిన వారు. వారు ఇతర మతాలను ప్రేమించి కడుపులో దాచుకునే గుణమే భారత్ ని ఇప్పటిదాకా కాపాడుతూ వచ్చింది.
పరమత సహనం ఈ గడ్డ మీద ఉంది. అలాంటి భారత్ లో ఇపుడు ప్రతీ చిన్న అంశం అతి పెద్ద వివాదంగా మారుతోంది. లోకల్ గా పుట్టిన సమస్య అక్కడే పరిష్కారం కావాలి. కానీ అది పెరిగి పెద్దదై ఇతర దేశాల నుంచి కూడా దాని మీద కామెంట్స్ వచ్చే పరిస్థితి ఎందుకు వస్తోంది అన్నదే ప్రశ్న.
దానికి కారణాలు ఏంటి, సమాజంలో వచ్చిన చైతన్యమా. మీడియాతో పాటు సాంకేతికత పెరిగిన నేపధ్యమా అన్నది కూడా చర్చగా ఉంది. ఇవన్నీ పక్కన పెడితే కర్నాటకలో హిజాబ్ అంశం ఇపుడు దేశంలో వేడిగా ఉంది. సుప్రీం కోర్టు దాకా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తున్నారు. ఇక కర్ణాటకలోని ఓ విద్యాసంస్థ ముస్లిం విద్యార్థినులు హిజాబ్ ధరించి రావద్దని ఆంక్షలు విధించిన సంగతి విధితమే.
అయితే దాని మీద అక్కడ మాట్లాడుకుని సానుకూలంగా సమస్య పరిష్కారం చేసుకుంటే పోయేది. కానీ అది అతి పెద్ద మత వివాదంగాఈ రోజున దేశాన రాజుకుంటోంది. మరి కావాలని చేశారా లేదా అన్నది కూడా చూడాలి. కర్నాటకలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం. దాంతో సహజంగా అక్కడ హజాబ్ వివాదాన్ని పెంచిపోషించే శక్తులూ అటూ ఇటూ ఉంటాయి. ఇంకో వైపు ఉత్తర భారతాన ఎన్నికలు జరుగుతున్నాయి. దాంతో అక్కడ రాజకీయ లబ్ది పొందాలని కొన్ని పార్టీలు పడుతున్న తంటాలు కూడా ఈ వ్యవహారాన్ని పెంచి పెద్దది చేస్తున్నాయి అని అంటున్నారు.
యూపీలో సమాజ్ వాద్ పార్టీకి చెందిన ఒక నాయకులురాలు రుబీనా ఖానం అయితే హిజాబీని టచ్ చేస్తే ఏకంగా చేతులు నరుకుతామని పరుష పదజాలంతో హెచ్చరిస్తున్నారు. ఇంకో వైపు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ అయితే మరి కాస్తా ముందుకు వెళ్లారు. ఆయన హిజాబీ ఏదో నాడు ఈ దేశ ప్రధాని అవుతారు అని సంచలన కామెంట్స్ చేశారు. హిజాబ్ ని ధరించడం ముస్లిం మహిళలకు ఉన్న ఒక హక్కు అని అసదుద్దీన్ అంటున్నారు. ఎవరాపుతారో చూస్తామని కూడా ఆయన గర్జిస్తున్నారు.
మరి వీటిని బట్టి ఏం అర్ధం చేసుకోవాలో మరి. హిజాబ్ అన్నది ఒక లోకల్ ఇష్యూ. ఈ దేశంలో ఏడున్నర పదుల స్వతంత్ర భారతలో ఆ సమస్య ఎపుడూ రాలేదు. బీజేపీ దీనికి కారణం అని అంటున్నా కూడా ఎనిమిదేళ్ల మోడీ ఏలుబడిలో కూడా ఎక్కడా ఈ సమస్య చోటు చేసుకోలేదు. ఇక కర్నాటకలో కూడా గతలోనూ బీజేపీ అధికారంలోఉంది. ప్రస్తుతం మూడేళ్ళుగా పాలిస్తోంది. కానీ ఈ ఘటనలు ఏవీ ఎపుడూ లేవు.
మరి ఇపుడే ఎందుకు వస్తోంది అంటే ఫక్తు రాజకీయం అనే అనుకోవాలి. ఉత్తరాది ఎన్నికల కోసం రాజేశారా లేక ఇలా రాజేసిన కుంపటి 2024 దాకా కొనసాగిస్తారా అన్నది కూడా ఆలోచించాలి. ఇపుడు ఈ దేశానికి ముస్లిం మహిళ ప్రధాని కావాలని అంటున్నారు. నిజానికి మత పరంగా ఏలికలు ఉండరు, ప్రజలు మెచ్చితే నాయకులు అవుతారు. ఎవరైనా ఈ దేశానికి ప్రధాని కావచ్చు. అందులో మతం, కులం చూడడం తప్పు. మరి ఆ వివేచన ఎపుడు వస్తుందో మరి. అంతవరకూ ఇలాగే లోకల్ ఇష్యూస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ సబ్జెక్టులు అవుతూనే ఉంటాయి.