Begin typing your search above and press return to search.
బాబు బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే ... ముస్లింల డిమాండ్ !
By: Tupaki Desk | 2 Dec 2020 6:53 AM GMTఏపీలో అసెంబ్లీ సమావేశాలు హాట్ హాట్ గా సాగుతున్నాయి. శీతాకాలంలో సమావేశాలు ప్రారంభమైనా కూడా వేడెక్కిస్తున్నాయి. సభలో టీడీపీ , వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. టీడీపీ నేతలని సస్పెండ్ చేసినా కూడా టీడీపీ ఎమ్మెల్యేలు చట్ట సభలో ప్రభుత్వం పై విమర్శలు కురిపిస్తూ రెచ్చిపోతున్నారు. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు తన వయసు, హోదా, తనకున్న రాజకీయ అనుభవాన్ని మరచిపోయి అసెంబ్లీలో ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ను అసభ్య పదజాలంతో దూషించడంపై ముస్లిం మైనార్టీలు భగ్గుమంటున్నాయి. రాజకీయాల్లో నేను అపర చాణిక్యుడిని అని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు అందరూ అసహ్యించుకునేలా ఉన్నాయని, ముస్లింలకు ఆయన బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.
చంద్రబాబు బహిరంగంగా క్షమాపణలు చెప్పకుంటే , రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ వైసీపీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో మంగళవారం కదిరిలోని అంబేడ్కర్ కూడలిలో రాస్తారోకో చేశారు. అధికారం కోల్పోయాక చంద్రబాబు ఎలా మాట్లాడాలో కూడా మర్చిపోయాడని అంటున్నారు. మొదటి నుండి మైనారిటీలు అంటే చంద్రబాబుకి చిన్నచూపే అని తన మంత్రివర్గంలో నాలుగున్నరేళ్లు ముస్లింలకు స్థానం కల్పించకుండా,ఓట్ల కోసం చివర్లో కొన్ని నెలలు ముస్లింలకు చోటిచ్చాడని అన్నారు. అలాగే అసెంబ్లీ స్థానాల్లో కూడా మైనారిటీలకు అన్యాయమే చేసారని , గెలిచే సత్తా ఉన్న ఏ ఒక్క స్థానాన్ని కూడా మైనారిటీలకు ఇవ్వలేదని హఫీజ్ ఖాన్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకొని , క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమంలోవైసీపీ పట్టణ అధ్యక్షుడు బాహవుద్దీన్, మైనార్టీ నాయకులు వేముల ఫయాజ్, జిలాన్, ఖలీల్, అన్సర్, నౌషాద్, ఫారూక్, ఎహసాన్, వలి, సాదిక్, అమీర్, ఖలందర్, నాసీర్ తదితరులు పాల్గొన్నారు.
ముస్లిం మైనారిటీలకు వైఎస్ నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించారని, ఆ కుటుంబానికి ముస్లింలు ఎప్పుడూ రుణపడి ఉంటారని వారు తెలిపారు. ప్రస్తుత సీఎం జగన్ కూడా ముస్లింల పక్షపాతిగా ఉన్నారని, ముస్లింలకు టికెట్ ఇవ్వడమే కాకుండా వారందరినీ గెలిపించుకున్నారని ప్రశంసలు కురిపించారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి.. నేడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిలు మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషి చేశారని, దీన్ని చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు. మీలా వెన్నుపోటు రాజకీయాలు చేయడం మైనార్టీలకు తెలియదని, తమకు మంచి చేసిన వారిపట్ల కృతజ్ఞతాభావంతో ఉండటమే తెలుసని అన్నారు. గత ఎన్నికలప్పుడు ‘బాబు హమారా’ అనే సభలోనే బాబు నిజస్వరూపం బయటపడిందన్నారు. మైనార్టీ యువకులపై పోలీసులతో దాడులు చేయించి, దేశద్రోహం కేసులు పెట్టించిన విషయాన్ని తాము మరువలేదన్నారు. ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ హిందూపురంలోని ముస్లింలు చంద్రబాబు దిష్టిబొమ్మతో ర్యాలీ నిర్వహించారు. మైనార్టీలు తలుచుకుంటే వచ్చే ఎన్నికల్లో మొన్నటి ఎన్నికల్లో గెలిచిన 23 సీట్లు కాస్తా నాలుగు సీట్లు అయ్యేలా చేస్తామని అన్నారు.