Begin typing your search above and press return to search.

అయోధ్య ఆలయం..గిఫ్ట్ ఇచ్చిన ముస్లిం ఫోరం

By:  Tupaki Desk   |   18 Nov 2019 3:02 PM IST
అయోధ్య ఆలయం..గిఫ్ట్ ఇచ్చిన ముస్లిం ఫోరం
X
దశాబ్ధాలుగా హిందూ-ముస్లింల మధ్య వివాదానికి దారితీసిన రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూవివాదాన్ని ఇటీవలే సుప్రీం కోర్టు పరిష్కరించింది. చారిత్రిక తీర్పును ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆ స్థలంలో రామమందిర నిర్మాణానికి పూనుకుంటున్నారు.

ఇక ఈ సుప్రీం తీర్పును హిందూ సంఘాలు, ముస్లిం వర్గాలు కూడా స్వాగతించాయి. మత సామరస్యతను చాటాయి. తాజాగా అస్సాంకు చెందిన 21 ముస్లిం సంస్థలు రామమందిర నిర్మాణానికి రూ.5 లక్షల విరాళం ఇవ్వడం దేశంలోనే సంచలనమైంది. ముస్లిం సంఘాలు ఇలా రామమందిరానికి విరాళం ఇచ్చి మత సామరస్యాన్ని చాటాయి.

అస్సాంకు చెందిన జనగుస్తియో సమ్మోన పరిషద్ అనే ముస్లిం సమాఖ్య తాజాగా అయోధ్య రామమందిర నిర్మాణానికి ఈ రూ.5 లక్షల విరాళం ఇచ్చింది. ఈ మేరకు అస్సాం మైనార్టీస్ డెవలప్ మెంట్ బోర్డు చైర్మన్ మోమినుల్ ప్రకటించారు. సుప్రీం తీర్పును తాము స్వాగతిస్తున్నామని పేర్కొంది.

అస్సాంకు చెందిన ప్రాచీన 21 ముస్లిం సంఘాలన్నీ అయోధ్య తీర్పును ప్రజల తీర్పుగా భావించాలని ముస్లింలకు పిలుపునిచ్చాయి. దీనిపై ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని శాంతిని పాటించాలని పిలుపునివ్వడం చర్చనీయాంశమైంది.