Begin typing your search above and press return to search.
బంగారమే ఇంకుగా భగవద్గీతను రాసిన ముస్లిం
By: Tupaki Desk | 17 Aug 2015 10:04 AM ISTపరమ పవిత్రంగా భావించే భగవద్గీతను ఒక ముస్లిం రాశాడు. ఇందుకోసం అతగాడు వినూత్నంగా ఆలోచించాడు. బంగారం కడ్డీని కరిగించి.. దాన్ని ఇంకుగా మార్చి మరీ రాశాడు. ఇందుకోసం అతగాడి కుటుంబం మొత్తం సాయం చేసినట్లు చెబుతున్నారు. బంగారంతో రాసిన భగవద్గీతను గుజరాత్ కు చెందిన 75 ఏళ్ల మహమ్మద్ షేక్ అనే ముస్లిం వ్యక్తి రాశాడు.
చేతితో తయారు చేసిన కాగితం మీద ప్రత్యేకమైన బంగారం ఇంకుతో 160 పేజీలలో భగవద్గీతను రాశారు. పేజీకి పదహారు లైన్లు ఉండేలా రాసిన ఈ పుస్తకాన్ని రూపొందించేందుకు రెండు నెలల సమయం పట్టింది. ఎప్పటికి చెడిపోని ఇంకు వాడాలన్న ఉద్దేశంతో బంగారాన్ని వినియోగించినట్లుగా చెప్పుకొచ్చాడు. ఈ ‘‘బంగారు భగవద్గీత’’ను తాజాగా ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు యూనిస్ షేక్ అందించాడు. ఈ భగవద్గీతను తయారు చేయాలని జైన్ మత పెద్దలు కోరారని.. అందుకే తానిలా తయారు చేసినట్లు చెప్పుకొచ్చాడు.