Begin typing your search above and press return to search.
48 గంటల్లో కిందకు వచ్చేసిన మస్క్.. ప్రపంచ కుబేరుడు ఎవరంటే?
By: Tupaki Desk | 4 March 2023 9:51 AM GMTఒకప్పుడు ప్రపంచ కుబేరుడు అంటే కనీసం ఆ కీర్తి కిరీటం ఒక నెల రోజులో.. పదిహేను రోజులో ఉండేది. ఇప్పుడదంతా మారిపోయింది. విషయం రోజుల్లోకి వచ్చేసింది. ఏ రోజుకు ఆ రోజు షేర్ మార్కెట్లో సదరు కంపెనీ షేర్ ధర ఆధారంగా మార్పులు వచ్చేయటం మొదలు పెట్టింది. దీంతో.. ప్రపంచ కుబేరుడి స్థానాన్ని చేజిక్కించుకోవటం ఎంత కష్టమో.. దాన్ని నిలబెట్టుకోవటం అంతే కష్టమైన పరిస్థితి. తాజాగా అలాంటి అనుభవమే టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కు ఎదురైంది.
రెండు రోజుల క్రితం ప్రపంచ కుబేరుడిగా ఎలాన్ మస్క్ నిలవటం తెలిసిందే. తాజాగా ఆయన షేరు ధర ఏకంగా ఏడు శాతానికి పడిపోయింది. దీంతో.. ఆయన సంపద రెండు రోజల్లో 11 బిలియన్ డాలర్లు తగ్గింది. ప్రస్తుతం ఆయన సంపద 176 బిలియన్ డాలర్లు కావటంతో ఆయన మొదటి స్థానం నుంచి రెండో స్థానానికి దిగాల్సి వచ్చింది. గడిచిన రెండు నెలల్లో టెస్లా షేర్లు దాదాపు 90 శాతం మేర పెరగటంతో ప్రపంచ కుబేరుడి స్థానాన్ని ఎలాన్ మస్క్ సొంతం చేసుకున్నారు.
అయితే.. షేరు ధర తగ్గిపోవటంతో ఆయన స్థానాన్ని.. ఫ్రాన్స్ బిజినెస్ మ్యాన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం బెర్నార్డ్ సంపద 187 బిలియన్ డాలర్లుగా ఉంది. మూడో స్థానంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ 117బిలియన్ డాలర్లతో ఉన్నారు. నాలుగో స్థానంలో బిల్ గేట్స్.. ఐదో స్థానంలో వారెన్ బఫెట్ ఉన్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.