Begin typing your search above and press return to search.
ట్విట్టర్ సీఈవోను ప్రకటించిన మస్క్.. మరో సంచలనం..!
By: Tupaki Desk | 15 Feb 2023 10:00 PM GMTఅపర కుబేరుడు.. టెస్లా.. ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ సంచనాలకు కేరాఫ్ గా నిలుస్తున్నారు. ఆయన ఏం చేసినా.. చేయకపోయినా అదొక సంచలనంగా మారుతోంది. గతేడాది ట్విట్టర్ భారీ ధర చెల్లించి ఎలాన్ మస్క్ హస్తగతం చేసుకున్నాడు. అయితే అందులో పనిచేస్తున్న కీలక వ్యక్తులను తప్పించి తన మార్క్ ప్రక్షాళన మొదలుపెట్టిన సంగతి అందరికీ తెలిసిందే.
ఇక ఆ తర్వాత పొదుపు చర్యల పేరుతో వేలాది మంది ఉద్యోగులను ఇంటికే పరిమితం చేశాడు. ఈక్రమంలోనే ఎలన్ మాస్క్ చర్యలపై ఉద్యోగులు న్యాయ స్థానాలను ఆశ్రయించారు. ఈ కేసుల్లో ఎలాన్ మస్క్ విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెల్సిందే. మరోవైపు ట్విట్టర్ ఖాతాదారులతో నిత్యం టచ్ లో ఉంటున్న ఎలాన్ మస్క్ వారి నుంచి అభిప్రాయాలను సైతం సేకరిస్తున్నారు.
ట్విట్టర్ కు సంబంధించి మార్పులు చేర్పులు.. ఇతర అంతర్జాతీయ సమస్యలపై సైతం ఎలన్ మాస్క్ పోల్ నిర్వహిస్తున్నారు. వీటి ఆధారంగా ఆయన తన తదుపరి చర్యలు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే ట్విట్టర్ సీఈవోగా తాను కొనసాగాలా? లేదంటే వేరొకరిని అందుకు ఎంపిక చేయాలా? అని ఎలాన్ మస్క్ గతంలో పోల్ నిర్వహించాడు. .
అయితే తన సొంతం పోల్ లోనే ఆయన ఓడిపోయారు. ఆయనకు వ్యతిరేకంగా సుమారు 56శాతం మంది ఓట్లు వేశారు. దీంతో ఆయన ట్విట్టర్ సీఈవోగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. నాటి నుంచి కొత్త సీఈవో ఎంపిక కోసం ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే పలువురు పేర్లు సైతం తెరపైకి వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లుగానే మిగిలిపోయాయి.
తాజాగా ఎలాన్ మస్క్ తన పెంపుడు కుక్క ప్లోకిని ట్విట్టర్ సీఈవో కుర్చీలో కూర్చోబెట్టాడు. ప్లోకిని ధరించిన టీ షర్టుపై సీఈవో అని రాసి ఉంది. ఇందుకు సంబంధించిన పలు పిక్స్ ను ఎలాన్ మస్క్ ట్విట్టర్లో షేర్ చేశాడు. ఇతనే ట్విట్టర్ కొత్త సీఈవో అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టు క్షణాల్లో వైరల్ గా మారింది.
ఇది వరకు సీఈవోగా పని చేసిన వ్యక్తి కంటే తన పెంపుడు కుక్క ప్లోకిని మెరుగ్గా పని చేస్తుందని పరోక్షంగా పాత సీఈవో పరాగ్ అగర్వాల్ పై సెటైర్ వేశాడు. ఇతర సీఈవో కంటే ఇదే చాలా బెటర్.. నెంబర్లలోనూ.. స్టైల్లోనూ అంటూ కితాబిచ్చాడు. కాగా పలువురు నెటిజన్లు మాత్రం మస్క్ చర్యలపై మండిపడుతున్నారు. మాజీ సీఈవోను కుక్క కంటే హీనం అని అర్థం వచ్చేలా పోస్ట్ పెట్టడం సరికాదని హితవు పలుకుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.