Begin typing your search above and press return to search.

పుట్టగొడుగులతో కరోనా ఖతం .. సీసీఎంబీ కీలక ప్రకటన !

By:  Tupaki Desk   |   23 Oct 2020 4:45 AM GMT
పుట్టగొడుగులతో కరోనా ఖతం ..  సీసీఎంబీ  కీలక ప్రకటన !
X
చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ , ఆ తర్వాత ఒక్కొక్క దేశానికీ విస్తరిస్తూ మొత్తం ప్రపంచంలోని ప్రతి దేశానికి వ్యాపించింది. ప్రస్తుతం అన్ని దేశాలు కూడా ఈ కరోనా మహమ్మారి నుండి ఎలా బయటపడాలో వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇక మానవాళిని ఆందోళనకు గురి చేస్తోన్న కరోనా వైరస్ నిర్మూలనకు సరైన వ్యాక్సిన్ కనిపెట్టేందుకు ప్రపంచంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలన్నీ కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. కరోనాను సమర్థవంతంగా నివారించేందుకు పరిశోధనలు జరుగుతున్న సమయంలో హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టింది. పుట్టగొడుగు లపై సీసీఎంబీ చేసిన పరిశోధనలు సక్సెస్ అయ్యాయి.

పుట్టగొడుగులో ఎక్కువగా ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, బీటా గ్లూకాన్స్ యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కరోనాకు చెక్ పెట్టగలవని పరిశోధనలో వెల్లడైంది. పుట్టగొడుగులతో చేసిన ఫుడ్ సప్లిమెంట్ కరోనా ‌ కు తక్షణ విరుగుడుగా ఉపయోగించవచ్చని నిర్ధారించారు. ఇందులో భాగంగా అటల్ ఇంక్యుబేషన్ ‌లోని స్టార్టప్ సంస్థ క్లోన్ డీల్స్, సీసీఎంబీతో సంయుక్త పరిశోధనలు చేసింది. ఔషధ ఆహార ఉత్పత్తి సంస్థ ఆంబ్రోషియా ఫుడ్ ఫామ్‌ తో కలిసి పుట్టగొడుగులతో చేసిన సప్లిమెంటును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయోగాలు చేపట్టింది.

కరోనాయిడ్‌ పేరుతో డిసెంబర్‌ నాటికి అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. సీసీఎంబీ సహకారంతో నడుస్తున్న క్లోన్‌ డీల్స్‌ అనే స్టార్టప్‌.. హిమాలయాల్లో దొరికే కార్డిసెప్స్‌ మిలిటరిస్‌ అనే పుట్టగొడుగుల నుంచి దీన్ని అభివృద్ధి చేసినట్టు వెల్లడించింది. పుట్టగొడుగుల్లోని కార్టిసెఫిన్‌, పసుపులోని కర్క్యూమిన్‌ సమ్మేళనంతో తయారు చేసిన కరోనాయిడ్‌లో అనేక పోషక విలువలున్నాయని, ఇది యాంటీవైరల్ ‌గా, ఇమ్యూనిటీ బూస్టర్‌ గా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు వివరించారు. క్లినికల్‌ ట్రయల్స్‌ కోసం అనుమతికి దరఖాస్తు చేసుకున్న క్లోన్‌డీల్స్‌.. ఇప్పటికే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏ అనుమతులు తీసుకున్నది. కరోనాయిడ్‌ ఫార్ములేషన్‌పై నాగపూర్‌, ముంబై, భోపాల్‌లోని ఆలిండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ సెంటర్లలో క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించనున్నది.