Begin typing your search above and press return to search.

మూసేవాల హత్య: పంజాబ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్

By:  Tupaki Desk   |   3 Jun 2022 5:53 AM GMT
మూసేవాల హత్య: పంజాబ్ ప్రభుత్వానికి హైకోర్టు షాక్
X
అధికారంలోకి వచ్చిన ఏడాది గడవకముందే ఆప్ ప్రభుత్వానికి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వ్యతిరేకంగా మారుతున్నాయి. తాజాగా ప్రముఖుల సెక్యూరిటీ కుదింపు విషయంలో హర్యానా హైకోర్టు ఆప్ సర్కార్ కు షాకిచ్చే ఆదేశాలు జారీ చేసింది.

ప్రముఖులందరికీ సెక్యూరిటీ పునరుద్ధరించాలని ఆర్డర్ వేయడంతో ఒకడుగు వెనక్కి వేసింది. దీంతో 424 మందికి సెక్యూరిటీని కల్పిస్తామని ప్రభుత్వం తెలపింది. తన భద్రతను తగ్గిస్తూ జారీ చేసిన ఉత్తర్వులపై పంజాబ్ మాజీ సీఎం ఓపీ సోనీ దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారించి ఈ ఆదేశాలు జారీ చేసింది.

అయితే ఆప్ ప్రభుత్వం ప్రముఖులకు సెక్యూరిటీ కుదింపుపై కోర్టుకు కారణాలను తెలిపింది. జూన్ 6న ఆపరేషన్ బ్లూ స్టార్ వార్షికోత్సవం ఉన్నందున భద్రతా సిబ్బంది అవసరమని అందుకే ప్రముఖులకు భద్రతా సిబ్బందిని కుదించినట్లు తెలిపింది. ఇందులో భాగంగానే ప్రముఖ సింగర్ మూసేవాలతో పాటు 424 మందికి సెక్యూరిటీ కుదించామని పేర్కొంది. జూన్ 7 నుంచి తప్పకుండా వీరందరికి సెక్యూరిటీని పునరుద్ధిరిస్తామని తెలిపింది.

సింగర్, కాంగ్రెస్ నేత మాన్సావాలా మే 29న హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే భద్రతా సిబ్బందిని తొలగించిన మరుసటి రోజే హత్యకు గురి కావడంతో ప్రభుత్వంపై విమర్శలు వచ్చాయి. భద్రతా కుదింపు చేయడంతోనే ఈ ఘటన జరిగిందంటూ కొందరు ఆరోపణలు చేశారు.

అంతేకాకుండా రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా నశించాయని, ముఖ్యమంత్రి పదవి నుంచి మాన్ సింగ్ దిగిపోవాలని డిమాండ్ చేస్తున్నారు.తమ ప్రభుత్వం అవినీతి వ్యతిరేకమం అని చెప్పుకుంటున్న ఆప్ విఐపీ సంస్కృతిని అంతం చేయాలనుకుంటోందని, అందుకే సెక్యూరిటీ సిబ్బందిని తగ్గిస్తోందని అంటున్నారు.

అయితే జూన్ 6న ఆపరేషన్ బ్లూ స్టార్ ఆపరేషన్ నిర్వహించేందుకే సెక్యూరిటీని తగ్గించామని ప్రభుత్వం చెబుతోంది. 1984లో స్వర్ణ దేవాలయంలో నక్కిన ఉగ్రవాదులను అంతం చేయడానికి ఆపరేషన్ బ్లూస్టార్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇందు కోసం పంజాబ్ లో ప్రతి ఏటా వార్షికోత్సవాలు నిర్వహిస్తోంది. ఇందులో సెక్యూరిటీ అవసరమున్న నేపథ్యంలో విఐపీలకు తగ్గించామని మాన్ సింగ్ చెబుతున్నారు. కానీ ప్రతిపక్షాల నుంచి విమర్శలు కొనసాగుతున్నాయి.