Begin typing your search above and press return to search.

వైసీపీ ఎంపీ ని వదలని జనసేన లో ఆ ఒక్కడూ...!

By:  Tupaki Desk   |   23 Jun 2023 10:00 AM GMT
వైసీపీ ఎంపీ ని వదలని జనసేన లో ఆ ఒక్కడూ...!
X
వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ఇపుడు ఒక ఇబ్బంది లో ఉన్నడు. ఎన్నడూ ఎదురు కాని విధంగా ఆయన ఇంటా బయటా సమస్యల తో సతమతం అవుతున్నారు. భార్యా కుమారుడు మూడు రోజుల పాటు కిడ్నాప్ కావడం నరకయాతన అనుభవించడం ఒక ఎత్తు అయితే తన వ్యాపారాల మీద కూడా విపక్షాలు కామెంట్స్ చేయడం. సొంత పార్టీ నుంచి అవసరమైన టైం లో తగినంత మద్దతు రాలేదని ఆవేదన కూడా ఉంది అంటున్నారు.

ఈ నేపధ్యంలో విపక్షాలు ఒక వైపు ఆయింట్మెంట్ పూస్తూనే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ కిడ్పాన్ అన్నది సినిమాటిక్ గా సాగిందని, ఒక డ్రామాగా ఉందని అంటున్నారు. దాంతో చిర్రెత్తుకుని వచ్చిన ఎంపీ మీడియా మీటింగ్ పెట్టి మరీ తన ఆవేశాన్ని ఆవేదన ను కక్కేశారు. తననే విమర్శిస్తూ మళ్లీ పరామర్శిస్తామని విపక్ష నాయకులు కొందరు అంటున్న తీరుని ఎండగట్టారు ఇదిలా ఉంటే విపక్షాలు కొంత తగ్గినా జనసేన లో ఒకే ఒక్కడు మాత్రం ఎంపీ ఎంవీవీ ని మాత్రం అసలు వదలడంలేదు.

ఆయనే విశాఖ నుంచి జనసేన తరఫున గెలిచిన ముగ్గురు కార్పోరేటర్లో కీలక నేత. డైనమిక్ లీడర్ మూర్తీ యాదవ్. ఆయన విశాఖ నుంచి ఏపీ రాజకీయాల దాకా మొత్తం మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఒంగోలు లో బాలినేని శ్రీనివాసరెడ్డి ని విమర్శించగలరు, రాయలసీమ లో మరో మంత్రి మీద ధాటీగా మాటల దాడి చేయగలరు. ఇక ఆయన ఎంవీవీని గట్టిగా టార్గెట్ చేస్తున్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే చర్చి భూముల ను ఎంపీ ప్రాజెక్ట్ కోసం టేకోవర్ చేశారని, ఆయన వ్యాపార సామ్రాజ్యం అంతా అధికారం అండతో సాగుతోందని నిందించారు.

ఈ క్రమంలో మీడియా మీట్ లో ఎంవీవీ జనసేన కార్పోరేటర్ మూర్తీ యాదవ్ మీద గట్టిగానే నోరు చేసుకున్నారు. తన వార్డు అభివృద్ధి చూసుకోని కార్పోరేటర్ నన్ను విమర్శిస్తున్నారని, ఆయన కు నేను విశాఖ వదిలి వెళ్ళిపోవడం హ్యాపీగా ఉంటుందిట అని మండిపడ్డారు. దానికి జనసేన కార్పొరేటర్ రియాక్ట్ అయ్యారు.

మీ అభివృద్ధి నా అభివృద్ధి చూసుకుందామా అని సవాల్ చేశారు. నా వార్డులో గడచిన రెండున్నరేళ్ళుగా ఎంతో అభివృద్ధి చేశా ను మీకు కావాలంటే చూపిస్తాను, మీరు నాలుగేళ్ళ కాలంలో ఎంపీ గా విశాఖ కు చేసిందేంటి, మీరు చెప్పుకోవడానికి ఒక్క అభివృద్ధి కార్యక్రమం ఉందా అని ప్రశ్నించారు. విశాఖ లాంటి సిటీకి కేంద్రాన్ని ఒప్పించి ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకుని వచ్చారా అని ఘాటైన కామెంట్స్ చేశారు.

నన్ను ప్రశ్నించడం కాదు నా సవాల్ కి స్వీకరించి జవాబు చెప్పండి అని రెట్టించారు. మీరు ఎంపీ గా ఉంటూ సొంత వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నారు తప్ప విశాఖ కు ఒరిగిందేంటి అని నిలదీశారు. మొత్తానికి జనసేన నుంచి విశాఖ లో వాయిస్ వినిపించే ఈ ఏకైక నాయకుడు పవన్ పార్టీలో ప్రశ్నించే నేతగా మారారు. తుచ తప్పకుండా ప్రతీ ఇష్యూ మీద మాట్లాడుతూనే ఉంటారు. ఆయనకు ఎంపీ ఏ విధంగా జవాబు చెబుతారో చూడాల్సి ఉంది.